Anil Mallella
-
ఇద్దరి నిర్ణయాలు.. ఆరుగురి జీవితాలు!
అనిల్ మల్లెల, మహిమా జంటగా నందు మల్లెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రెండు రెళ్ళు ఆరు’. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం, డే డ్రీమ్స్ బ్యానర్స్‌పై ప్రదీప్ చంద్ర, మోహన్ అండె నిర్మించారు. శనివారం ఈ సినిమా విడుదల కానుంది. నందు మల్లెల మాట్లాడుతూ– ‘‘మొబైల్లో కావల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించాలంటే కథ బాగుండాలి. అందుకే కథ బాగా రాసుకున్నా. ఇద్దరి నిర్ణయాలతో ఆరుగురు జీవితాలు ఎలా ముడిపడి ఉన్నాయన్నదే కథ. సాయిగారు చూసిన పది నిమిషాలకే ఇంప్రెస్ అయ్యి, సినిమా తీసుకుంటాం అన్నారు. ఆ రోజే టీ–షర్ట్లు మార్చి కాలర్ చొక్కాలు వేసుకున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘హీరో నా బ్రదరే. క్యారెక్టర్‌కు సూట్ అవుతాడని ప్రొడ్యూసర్‌గారే సెలక్ట్ చేశారు. ఊహల్లో విహరించను. విలువలు లేకుండా సినిమాలు తీయను. నాకివ్వాలనుకునే డబ్బుల్ని సినిమాపై ఖర్చు పెట్టమని చెప్పాను. ఫ్రీడమ్ ఇస్తే చాలనుకున్నాను. అది లభించింది. అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. -
రెండు రెళ్లు నాలుగు కాదు
రెండు రెళ్లు ఎంత? అంటే నాలుగని సమాధానం చెబుతారెవరైనా. కానీ, రెండు రెళ్లు ఆరు అంటున్నారు ‘రెండు రెళ్ళు ఆరు’ చిత్రబృందం. కథలో ఉన్న ట్విస్ట్ అదేనట. అనిల్ మల్లెల, మహిమా జంటగా నందు మల్లెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 8న విడుదల కానుంది. సాయి కొర్రపాటి సమర్పణలో ప్రదీప్‌చంద్ర, మోహన్ అందె నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. కుటుంబ సభ్యులందరూ చూసేలా నందు ఈ సినిమా తీశారు. చిన్న సినిమాగా ప్రారంభమైన మా చిత్రం సాయిగారి వల్ల పెద్ద సినిమాగా మారింది. విజయ్ బుల్గానిన్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. -
పది లైన్స్‌లో ఈ కథ చెప్పారు... బాగుంది
– రాజమౌళి ‘‘కథ వినగానే బాగా జడ్జ్ చేసే టాలెంట్ సాయిగారికి ఉంది. ‘ఈగ’ చిత్రాన్ని చిన్న సినిమాగా తీద్దామని అంటే, ‘ఇది పెద్ద మాస్ సినిమా సార్.. పెద్దగా తీద్దాం’ అని నన్నెంతో ప్రోత్సహించారు. ప్రేక్షకుల నాడి పట్టుకోగల మంచి అభిరుచి ఉన్న నిర్మాత ఆయన’’ అని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అన్నారు. అనీల్ మల్లెల, మహిమా జంటగా నందు మల్లెల దర్శకత్వంలో సాయికొర్రపాటి సమర్పణలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రెండు రెళ్ళు అరు’. వారాహి చలన చిత్రం, డే డ్రీమ్స్ పతాకాలపై ప్రదీప్ చంద్ర, మోహన్ అండె నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను రాజమౌళి, థియేట్రికల్ ట్రైలర్‌ను సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి విడుదల చేశారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘సాయి పది లైన్స్‌లో ‘రెండు రెళ్ళు ఆరు’ కథ నాకు వినిపించారు. ఓపెనింగ్ సీన్ చాలా బావుందనిపించింది. ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్స్ను దాటి ప్రేక్షకులు సినిమాకు రావాలంటే కథలో ఏదో కొత్తదనం ఉండాల్సిందే. అలాంటి ఇంట్రెస్టింగ్, హార్ట్ టచింగ్, హ్యూమర్ ఉన్న సినిమా ఇది. ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి’’ అన్నారు. ‘‘మా టీమ్ కన్న కలలకు నిర్మాతలు ప్రదీప్, మోహన్‌గారు రూపమిస్తే, సాయికొర్రపాటిగారు ప్రాణం పోశారు’’ అన్నారు నందు మల్లెల. ప్రదీప్ చంద్ర, మోహన్ అండె, అనిల్ మల్లెల, మహిమా, విజయ్ బుల్గానిన్, నటులు సీనియర్ నరేశ్, అవసరాల శ్రీనివాస్, సంగీత దర్శకుడు డీజే వసంత్ తదితరులు పాల్గొన్నారు.