‘నా బంగారు తల్లి’కి అంతర్జాతీయ పురస్కారం
‘ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధ’ ఫేమ్ రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో రూపొందిన ‘నా బంగారు తల్లి’ చిత్రం ట్రినిటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది. అంజలి పాటిక్, సిద్ధిక్ ముఖ్యతారలుగా ఎం.ఎస్.రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
రాజేష్ టచ్ రివర్ మాట్లాడుతూ -‘‘హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఈ సినిమా తీశాం. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఓ తెలుగు సినిమాకు ట్రినిటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో గుర్తింపు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది.
ఇతర చిత్రోత్సవాలక్కూడా ఈ సినిమాను పంపిస్తున్నాం. సెన్సార్ పూర్తయింది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: సురేష్, కెమెరా: రామతులసి, సంగీతం: శరత్, సహనిర్మాతలు: సునీతకృష్ణన్.