అంకాలమ్మ ఆలయంలో వైఎస్ జగన్ పూజలు
కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మగూడూరు అంకాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్ అంకాలమ్మ ఆలయ దర్శనానికి వచ్చారు.
బలపనూరులో ఇటీవల మరణించిన సర్పంచ్ సరస్వతి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ రోజు ఉదయం వైఎస్ జగన్ కడపకు వెళ్లారు. నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థినుల తల్లిదండ్రులను కడప రిమ్స్ ఆస్పత్రి వద్ద పరామర్శించారు. విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.