బస్సు ఎక్కబోతూ..జారిపడి వృద్ధురాలు మృతి
బస్సు ఎక్కే క్రమంలో జారిపడి ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం నౌతాల గ్రామం సమీపంలో రుగడకొమానపల్లి గ్రామానికి చెందిన గంటా అన్నమ్మ(70) ఆర్టీసీ బస్సు ముందు డోర్ తీసుకుని ఎక్కబోయింది. అయితే, డ్రైవర్ ఇది గమనించక బస్సును ముందుకు కదిలించడంతో.. జారి వెనక చక్రాల కింద పడి మృతి చెందింది. నౌతాల గ్రామం నుంచి స్వగ్రామానికి వెళ్లబోయే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమెకు ఏడుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.