Anoop Singh Thakur
-
సూర్య, అల్లు అర్జున్‌తో ఢీకొట్టి.. విలన్‌గా మెప్పించిన అనూప్ సింగ్ మనోడే
సాక్షి, ఆదిలాబాద్: ‘.. ఇఫ్ యూ ఆర్ ఏ ట్రూ ఇండియన్ పోలీస్.. నన్ను గెలిచి చంపరా అని సూర్యకు సవాల్ విసిరాడు. నేనెవరో తెలుసా.. చల్లా కొడుకుని రా.. అని అల్లు అర్జున్‌తో ఫైట్ చేశాడు. అమిగో.. అమిగో అంటూ రోగ్ సినిమాలో సైకో పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. విలన్‌గా వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనూప్‌సింగ్ ఠాకూర్ మనోడే. సినీరంగంలో రాణిస్తూ జిల్లాతో ఆత్మీయానుబంధం ఉన్న అనూప్‌పై ఈ వారం సండేస్పెషల్. చదవండి: ఇలా అవుతుందనుకోలేదు, ఆ హీరోయిన్‌తో సినిమా చేయను నో.. అన్నచోటే అనూప్ది మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పుడు పైలట్ కావాలనుకున్నాడు. శిక్షణ సైతం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే నటుడు కావాలనే ఆలోచనకు అంకురార్పణ జరిగింది. 129 సార్లు ఆడిషన్స్‌కి వెళ్లినా నో అనే పదమే వినిపించింది. అయినా వెనుకడుగు వేయలేదు. బుల్లి తెరపై వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. వెండితెరపై అరంగేట్రం చేశాడు. ప్రతినాయకుడిగా సత్తా చాటాడు. టాలీవుడ్లో అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సీరియల్ నటుడి నుంచి.. అనూప్ అరంగేట్రం బుల్లితెర నుంచి మొదలైంది. తొలుత హిందీ దారావాహికలు అయిన మహాభారత్, జై భజరంగబలి, రామాయణం, అక్బర్–బీర్బల్, సీఐడీ, చంద్రగుప్త మౌర్య, ఆర్యన్‌లో నటించాడు. మహాభారత్ సీరియల్లో దృతరాష్రు్టని పాత్ర పోషించాడు. ఇది ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. అయితే ఈ పాత్ర కోసం విపరీతమైన బరువు పెరిగాడు. సినీ ఆఫర్స్ రాని పరిస్థితి. ఈ క్రమంలో నిరంతర వ్యాయామంతో కొవ్వును కండరాలుగా మార్చుకున్నాడు. బాడీ బిల్డర్‌గా మారిపోయాడు. 2015లో మిస్టర్ ఇండియా, మిస్టర్ ఆసియా, మిస్టర్ వరల్డ్ టైటిళ్లను గెలుచుకున్నాడు. వరల్డ్ బాడీబిల్డింగ్ ‘ఫిట్నెస్ ఫిజిక్ విభాగం’లో గోల్డ్‌మెడల్ సాధించిన తొలిభారతీయుడు కావడం విశేషం. సినీ ప్రయాణం ఇలా... బాడీ బిల్డర్ తర్వాత అనూప్‌కు సినీ అవకాశాలు వరుస కట్టాయి. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన రోగ్ చిత్రంతో అరంగేట్రం చేశాడు. హీరో సూర్య నటించిన యముడు–3లో విలన్‌గా నటించి మెప్పించాడు. తర్వాత హిందీ చిత్రం కమాండో–2, కన్నడ సినిమా యజమానలో, తెలుగులో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, విన్నర్, ఆచారి అమెరికా యాత్ర, కిలాడీ చిత్రాల్లో నటించాడు. ఆది హీరోగా తెరకెక్కిన తీస్మార్ఖాన్ చిత్రంలోనూ నటించాడు. ఇది ఆగస్టు 19న విడుదల కానుంది. ఇక కన్నడలో ఉద్ఘర్ష, మరాఠీలో బేబాన్ సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటిస్తున్న హిందీ సినిమా కంట్రోల్లో పోలీస్ ఆఫీసర్‌గా కీలక పాత్రలో నటిస్తున్నాడు. గతంలో ఆయన నటించిన యముడు–3 హిందీ రీమేక్‌లో ప్రస్తుతం హీరోగా అవకాశం దక్కింది. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. ఆదిలాబాద్ టౌన్ నుంచి బీటౌన్ దాకా.. అనూప్‌సింగ్ ఠాకూర్ మల్టీ టాలెంటెడ్. నేపథ్య గాయకుడు, మోడల్, అథ్లెట్. అమెరికాలో పైలట్‌గా శిక్షణ సైతం పొందాడు. 17 ఏళ్ల నుంచే మోడలింగ్ చేశాడు. కండల వీరుడు కూడా. తండ్రి ఇంద్రజిత్ సింగ్ ఠాకూర్‌ది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి. ఇంద్రజిత్ వివాహం పూనమ్ దేవిసింగ్‌తో ఇక్కడే జరిగింది. అనంతరం వీరి కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం అక్కడి హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు ఇంద్రజిత్. అనూప్ సోదరులు, వారి చిన్నాన్న, పెద్ద నాన్నలు ఇక్కడే ఉండడంతో ఏ శుభకార్యం జరిగినా తరచూ ఇక్కడికి వస్తుంటారని కుటుంబ సభ్యులు ఆనందంతో చెబుతున్నారు. -
మిస్టర్ రావణ
‘విన్నర్’, ‘రోగ్’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాల్లో ప్రతి నాయకుడిగా నటించిన అనూప్‌సింగ్ ఠాగూర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. అనూప్‌సింగ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘మిస్టర్ రావణ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో సలోని కథానాయిక. కుందన్ ఆర్ట్స్ పతాకంపై కుందన్ రాజ్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల ముంబైలో జరిగింది. ఈ చిత్రానికి ఇంద్రజిత్ సహ–నిర్మాత. అనూప్ మాట్లాడుతూ–‘‘స్క్రిప్ట్ బాగుంది. నా క్యారెక్టరైజేషన్‌ను బాగా డిజైన్ చేశారు. నటుడిగా నా కెరీర్లో ఇదొక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర వాస్తవానికి దగ్గరగా ఉంటుంది’’ అన్నారు సలోని. ‘‘అన్ని భాషల నటీనటులు ఈ సినిమాలో ఉంటారు’’ అన్నారు కుందన్ రాజ్. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్ రెడ్డి. -
ఉద్ఘర్ష మంచి అనుభూతిని కలిగిస్తుంది
కన్నడ పరిశ్రమలో వినూత్న సినిమాలతో పేరు పొందారు దర్శకుడు సునీల్ కుమార్ దేశాయ్. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘ఉద్ఘర్ష’. అనూప్ సింగ్ ఠాకూర్, తాన్యా హోప్, ధన్సిక, శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. దేవరాజ్ నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మర్డర్ మిస్టరీ ట్రైలర్ లాంచ్ బెంగళూర్‌లో జరిగింది. ‘కిచ్చ’ సుదీప్ వాయిస్ ఓవర్ అందించిన ఈ ట్రైలర్‌ను కన్నడ చాలెంజింగ్ స్టార్ దర్శన్, నటి ప్రేమ విడుదల చేశారు. ఈ సందర్భంగా అనూప్ సింగ్ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లో మోస్ట్ చాలెంజింగ్ పాత్ర ఇది. సినిమా చేయడంలో కొంచెం ఆలస్యం అయింది. అయినా ఎక్కడా నా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా చూసుకున్నారు దర్శకుడు దేశాయ్. ఆయన సినిమాలో పని చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. గొప్ప థ్రిల్లర్‌ను చూశారన్న అనుభూతిని పొందుతారు’’ అన్నారు. ‘‘సునీల్‌గారి సినిమా అనగానే ఓకే అన్నాను. సునీల్కుమార్గారితో ఆల్రెడీ ‘రే’ అనే సినిమా చేశాను. ఇందులో నా క్యారెక్టర్ ఏంటో చెప్పకూడదు. సస్పెన్స్. కానీ కచ్చితంగా షాక్ అవుతారు’’ అన్నారు హర్షిక పొన్నాడ ‘‘కన్నడ నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పాడు ఠాకూర్. తనని అభినందించి తీరాలి’’ అన్నారు దర్శన్. ‘‘వాయిస్ ఓవర్ అందించిన సుదీప్‌కు థ్యాంక్స్. టీమ్ అందరూ కష్టపడ్డాం. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సునీల్‌కుమార్ దేశాయ్. -
విలన్ కాదు హీరో
‘యముడు 3, విన్నర్, రోగ్’ తదితర సినిమాల్లో విలన్‌గా నటించిన అనూప్ సింగ్ ఠాకూర్ హీరోగా నటించిన చిత్రం ‘ఉద్ఘర్ష’. ధన్సిక, కబీర్ దూహన్ సింగ్, శ్రద్ధా దాస్, తాన్యా హోప్, ‘బాహుబలి’ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో సునీల్ కుమార్ దేశాయ్ తెరకెక్కించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని డి క్రియేషన్స్ పతాకంపై దేవరాజ్ నిర్మించారు. డి. మంజునాథ్, రాజేంద్ర కుమార్ సహనిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసి, దర్శకుడు సునీల్ దేశాయ్ మాట్లాడుతూ – ‘‘ఇది నా తొలి తెలుగు సినిమా. ఇంతకు ముందు నా సినిమాలు కొన్ని అనువాదమయ్యాయి. యాక్షన్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. డిఫరెంట్ సబ్జెక్ట్. పాటలు ఉండవు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తాం. అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను’’ అన్నారు. నిర్మాత దేవరాజ్ మాట్లాడుతూ – ‘‘ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. దర్శకుడితో నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. సినిమా విజయం మీద నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘ఇది నా రెండో సినిమా. దర్శకుడు వన్ మ్యాన్ ఆర్మీ. ఒకేసారి మూడు భాషల్లో నటించడం చాలెంజింగ్‌గా ఉంది’’ అన్నారు ధన్సిక. ‘‘హీరోగా చేయడం ఆనందంగా ఉంది. సినిమాలో మంచి ఫైట్స్ ఉన్నాయి. ఇలాంటి టీమ్‌తో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు అనూప్ సింగ్ ఠాకూర్. ఈ చిత్రానికి కెమెరా: పి రాజన్ విష్ణువర్థన్, సంగీతం: సంజోయ్ చౌదరి. -
అయ్యో పాపం
ఇక్కడి ఫొటోలో ఉన్నది ఎవరో తెలుసుగా! అదేనండీ.. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమాలో యోగి క్యారెక్టర్లో రఫ్పాడించిన సాయి ధన్సికనే. ఇంతకీ ఆమె చేతులు, కాళ్లు ఎందుకు కట్టేశారు? అంటే సినిమా కోసం అన్నమాట. ఇంకోమాట.. ఫొటోలో ధన్సిక కూర్చున్నది స్నూకర్ టేబుల్‌పైన అని అర్థం అవుతోంది కదూ. పాపం.. అలానే రాత్రంతా కూర్చున్నారట. సునీల్ కుమార్ దేశాయ్ దర్శకత్వంలో కన్నడలో రూపొందుతున్న ‘ఉద్ఘర్ష’ సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ సీన్లో ధన్సిక ఇలా కనిపించనున్నారు. తెలుగు సినిమాలు ‘రోగ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఆచారి ఆమెరికా యాత్ర’ సినిమాల్లో విలన్‌గా నటించిన అనూప్ సింగ్ ఠాకూర్ ఈ సినిమాలో ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. అన్నట్లు.. తెలుగులో ధన్సిక స్ట్రయిట్ సినిమా ‘వాలుజడ’ చేస్తున్నారు. -
ఇక్కడ విలన్ అక్కడ హీరో
‘‘నేను సెటిలైంది ముంబైలో అయినప్ప టికీ హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. మా పూర్వీకులు ఇక్కడే ఉండేవాళ్లు. నాకు తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది’’ అని అనూప్ సింగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం విడుదలైన ‘రోగ్’లో ఆయన విలన్‌గా నటించారు. అంతకుముందు ‘విన్నర్’, ‘సింగమ్–3’ చిత్రాల్లో నటించిన అనూప్ బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చారు. కెరీర్ గురించి అనూప్ సింగ్ పత్రికలవారితో మాట్లాడుతూ – ‘‘బుల్లితెర నటుడిగా ‘మహాభారతం’ గుర్తింపు తెచ్చింది. ‘టెంపర్’ షూటింగ్ చూసినప్పుడు పూరీగారంటే అభిమానం ఏర్పడింది. ఆయన సినిమాల్లో చేయాలనుకున్నా. ‘రోగ్’కి ఛాన్స్ వచ్చినప్పుడు మిస్టర్ వరల్డ్ గెల్చుకున్నప్పుడు కన్నా రెట్టింపు ఆనందం కలిగింది. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు చేస్తున్నాను. మరాఠీలో రెండు సినిమాల్లో హీరోగా యాక్ట్ చేస్తున్నా. హిందీ సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు.