మంజునాథ్, ఠాకూర్ అనూప్ సింగ్, సునిల్‌కుమార్, దేవరాజ్
‘యముడు 3, విన్నర్, రోగ్’ తదితర సినిమాల్లో విలన్‌గా నటించిన అనూప్ సింగ్ ఠాకూర్ హీరోగా నటించిన చిత్రం ‘ఉద్ఘర్ష’. ధన్సిక, కబీర్ దూహన్ సింగ్, శ్రద్ధా దాస్, తాన్యా హోప్, ‘బాహుబలి’ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో సునీల్ కుమార్ దేశాయ్ తెరకెక్కించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని డి క్రియేషన్స్ పతాకంపై దేవరాజ్ నిర్మించారు. డి. మంజునాథ్, రాజేంద్ర కుమార్ సహనిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసి, దర్శకుడు సునీల్ దేశాయ్ మాట్లాడుతూ – ‘‘ఇది నా తొలి తెలుగు సినిమా. ఇంతకు ముందు నా సినిమాలు కొన్ని అనువాదమయ్యాయి.
యాక్షన్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. డిఫరెంట్ సబ్జెక్ట్. పాటలు ఉండవు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తాం. అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను’’ అన్నారు. నిర్మాత దేవరాజ్ మాట్లాడుతూ – ‘‘ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. దర్శకుడితో నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. సినిమా విజయం మీద నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘ఇది నా రెండో సినిమా. దర్శకుడు వన్ మ్యాన్ ఆర్మీ. ఒకేసారి మూడు భాషల్లో నటించడం చాలెంజింగ్‌గా ఉంది’’ అన్నారు ధన్సిక. ‘‘హీరోగా చేయడం ఆనందంగా ఉంది. సినిమాలో మంచి ఫైట్స్ ఉన్నాయి. ఇలాంటి టీమ్‌తో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు అనూప్ సింగ్ ఠాకూర్. ఈ చిత్రానికి కెమెరా: పి రాజన్ విష్ణువర్థన్, సంగీతం: సంజోయ్ చౌదరి.
Comments
Please login to add a commentAdd a comment