పాముకాటుతో మహిళ మృతి
మదనపల్లెరూరల్ (చిత్తూరు): పాముకాటుతో మహిళ మృతిచెందింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండలంలోని మాలేపాడు పంచాయతీ పచారవాండ్లపల్లెకు చెందిన సుబ్బరాయప్ప భార్య అమృత (28) బుధవారం ఉదయం పొలానికి వెళ్లింది. కలుపు తీస్తుండగా పాము కాటేయటంతో విష ప్రభావంతో స్పృహతప్పి పడిపోయింది. అయితే, సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబసభ్యులు వెళ్లి చూడగా.. అమృత అపస్మారక స్థితిలో పడి ఉంది. అయితే, గ్రామానికి రహదారి, వైద్య సదుపాయాలు లేకపోవటంతో ఆమెకు వైద్యం అందలేదు. పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం ఆమె తుది శ్వాస విడిచింది.