Antalya
-
Antalya:ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్–1 టోర్నీ బరిలో సురేఖ
కొన్నేళ్లుగా ఆర్చరీ ప్రపంచకప్ టోర్నీలలో నిలకడగా పతకాలు సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ మరో కొత్త సీజన్‌కు సిద్ధమైంది. అంటాల్యాలో నేటి నుంచి వరల్డ్‌కప్ స్టేజ్–1 టోర్నీ జరగనుంది. జ్యోతి సురేఖతోపాటు అవ్నీత్ కౌర్, అదితి స్వామి, సాక్షి చౌదరీ మహిళల కాంపౌండ్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో బరిలోకి దిగుతారు. 52 దేశాల నుంచి 394 మంది ఆర్చర్లు రికర్వ్, కాంపౌండ్ ఈవెంట్స్‌లో ఈ టోర్నీలో ఆడనున్నారు. -
సెమీస్‌లో పేస్ జంట
న్యూఢిల్లీ: అంటాల్యా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)–ఆదిల్ షమస్దీన్ (కెనడా) ద్వయం సెమీఫైనల్‌కు చేరింది. టర్కీలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పేస్–షమస్దీన్ జంట 6–1, 6–2తో బెర్లోక్ (అర్జెంటీనా)–జోవో సుసా (పోర్చుగల్) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్‌లో దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) జంట 6–7 (9/11), 7–6 (7/4), 4–10తో మాట్ పావిక్ (క్రొయేషియా)–ఒలివెర్ మరాచ్ (ఆస్ట్రియా) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. గురువారం జరిగే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో బగ్దాటిస్‌తో రామ్‌కుమార్ ఆడతాడు.