ఏకాంత చర్చల ఆంతర్యమేమిటో..?
భువనగిరి : టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎలిమినేటి కృష్ణారెడ్డితో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఏకాంత చర్చలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బుధవారం మధ్యాహ్నం మంత్రి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి కృష్ణారెడ్డి ఇంటికి 1.55 గంటలకు వచ్చారు. టీఆర్ఎస్ విధానాలపై అలకతో ఉన్న కృష్ణారెడ్డి ఇటీవల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని వస్తున్న వార్తల నేప«థ్యంలో మంత్రి రాక ప్రా«ధాన్యం సంతరించుకుంది. 2.10 గంటలకు గదిలోకి వెళ్లిన మంత్రి, కృష్ణారెడ్డిలు తిరిగి 3.25 గంటలకు ఇద్దరు బయటకు వచ్చారు. సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. స్థానికంగా తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని కృష్ణారెడ్డి మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అనంతరం వెళ్లిపోతున్న మంత్రిని చర్చల్లో సంతృప్తి చెందారా అని ప్రశ్నించగా.. అసలు అసంతృప్తి ఎక్కడా లేదని పేర్కొన్నారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ తనను మర్యాదపూర్వకంగా కలవడానికే మంత్రి వచ్చారని స్పష్టం చేశారు. కాగా ఇద్దరు చర్చలు జరుపుతున్నంత సేపు ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి అక్కడే వేచి ఉన్నారు. అనంత రం మంత్రి, ఎమ్మెల్యే బీబీనగర్ Ðð ళ్లారు.