బాగా ఆడుతున్నాడు..!
గత వారం ప్రపంచంలోనే ఖరీదైన టీనేజ్ ఆటగాడిగా రికార్డులకెక్కిన ఆంటోనీ మార్టియల్ కి కెప్టెన్ రూని సపోర్ట్ దొరికింది. ఈ 19ఏళ్ల మంచెస్టర్ యునేటెడ్ ఆటగాడికి కెప్టెన్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. డీల్ గురించి మాట్లాడిన రూనీ, డీల్ కు సంబంధించి తనకు పెద్దగా సమాచారం తెలీదని.. కానీ.. గత సీజన్ లో ఆర్సనల్ టీమ్ పై అతడి ఆటన చూశానని చెప్పాడు. ఆంటోనీ చాలా ప్రతిభావంతుడని.. తమ జట్టు తరఫున అతను అత్యున్నత ప్రదర్శన ఇస్తాడని ఆశించాడు. గత వారంలో భారీగా 36 మిలియన్ పౌండ్ల డీల్ కొట్టేసిన సంగతి తెలిసిందే. లీగ్ చరిత్రలోనే మూడో అతిపెద్ద డీల్ ఇదే కావడం విశేషం.