అంతూలే మృతికి గవర్నర్ సంతాపం
ముంబై: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎ.ఆర్.అంతూలే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని గవర్నర్ విద్యాసాగరరావు పేర్కొన్నారు. ఆయన మృతిపట్ల బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రానికి, దేశానికి ఎన్నో సేవలందించిన అంతూలే మాటకు కట్టుబడిన నాయకుల్లో ఒకరు’అని అన్నారు. రాష్ర్టం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు.
కాంగ్రెస్ నేత ఉదయ్సింగ్రావ్గైక్వాడ్ మృతి
సాక్షి, ముంబై: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉదయ్సింగ్రావ్ గైక్వాడ్ (85) మంగళవారం మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆయన కొల్హాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన భౌతిక కాయానికి పంచగంగ శ్మశాన వాటికలో బుధవారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 1930 ఆగస్టు 28న జన్మించిన సింగ్... సర్దార్ కుటుంబానికి చెందివారు.
కాంగ్రెస్ టికెటుపై 1965లో తొలిసారి ఎన్నికల బరిలో దిగిన సింగ్..పీడబ్ల్యూపీ పార్టీ అభ్యర్థిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత 1972, 1978లో జరిగిన ఎన్నికల్లో కూడా విజయ బావుటా ఎగురవేశారు. 1973లో వసంత్‌రావ్ నాయిక్ కేబినెట్లో సహాయ మంత్రి బాధ్యతలను నిర్వర్తించారు. గా చోటు సంపాధించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 1980లో ఆయనకు కొల్హాపూర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కొల్హాపూర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి విజయఢంకా మోగించారు.