appointed coordinators
-
పట్టణ సహకార బ్యాంకులకు నాలుగంచెల వ్యవస్థ
ముంబై: అర్బన్ కోపరేటివ్ బ్యాంకుల (యూసీబీలు)కు నాలుగు అంచెల నిర్మాణాన్ని ఆర్బీఐ నియమిత కమిటీ సూచించింది. డిపాజిట్లు, క్యాపిటల్ అడెక్వసీ రేషియో, పరిమాణం ఆధారంగా నియంత్రణపరమైన నిబంధనల ఆధారంగా ఈ సిఫారసు చేసింది. రూ.100 కోట్ల వరకు డిపాజిట్లు కలిగిన యూసీబీలను టైర్–1 కింద... రూ.100–1,000 కోట్ల మధ్య డిపాజిట్లు ఉన్న యూసీబీలను టైర్–2 కింద, రూ.1,000–10,000 కోట్ల మధ్య డిపాజిట్లు కలిగిన యూసీబీలను టైర్–3 కింద, రూ.10,000 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్న యూసీబీలను టైర్–4 కింద వర్గీకరించాలని పేర్కొంది. కనీస ‘క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో’ను (సీఆర్ఏఆర్) 9–15 శాతం మధ్య సిఫారసు చేసింది. అలాగే, టైర్–4 యూసీబీలకు బాసెల్–3 నిబంధనలను సూచించింది. గృహ రుణాలు, బంగారం ఆభరణాలపై రుణాలు, అన్సెక్యూర్డ్ రుణాలకు సంబంధించి ఈ విభాగాల వారీగా వేర్వేరు పరిమితులు ఉండాలని పేర్కొంది. నిర్దేశిత అవసరాలను చేరుకోలేకపోయిన యూసీబీలకు తగినంత సమయం ఇచ్చిన తర్వాత తప్పనిసరి విలీన మార్గాన్ని అనుసరించొచ్చని కమిటీ తన సిఫారసుల్లో సూచించడం గమనార్హం. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం కింద యూసీబీల విలీనం, పునర్నిర్మాణానికి సంబంధించి ఆర్బీఐ ఒక పథకాన్ని రూపొందించుకోవచ్చని పేర్కొంది. ప్రాథమిక పట్టణ సహకార బ్యాంకులపై అధ్యయనం, సిఫారసుల కోసం ఎన్ఎస్ విశ్వనాథన్ చైర్మన్గా ఆర్బీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక నిపుణుల కమిటీని నియమించింది. -
పది వేల మందికి ఉపాధి
చిలకలపూడి (మచిలీపట్నం) : ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది 10వేల మంది ఎస్సీ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు లక్ష్యంగా నిర్ణయించటం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు. ఆయన కార్యాలయంలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ యువస్ఫూర్తి పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పదో తరగతి విద్యార్హత నుంచే ఉపాధి అవకాశం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఇద్దరు ఎస్సీ యువకులు, యువతులను సమన్వయకర్తలుగా నియమించామని, ఈ సమన్వయకర్తలు చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వారిచే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకుంటారన్నారు. ఒక్కొక్క ధరఖాస్తుకు రూ. 25లు చొప్పున సమన్వయకర్తలకు ప్రోత్సాహకంగా అందజేస్తామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్స్ విద్యార్థులకు ఉపాధి అవకాశాల కల్పనపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలలో తమ కార్యాలయ సిబ్బందిని నియమించామని, అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థులకు ఈ అవకాశంపై అవగాహన కల్పిస్తారన్నారు. ఆయా మండలాల ఎంపీడీవోలకు కూడా సమన్వయకర్తలను ప్రోత్సాహపరిచి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెబ్సైట్ ద్వారా దరఖాస్తును నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 20వ తేదీలోగా ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈడీ కోరారు.