Arbil
-
అమెరికాకు ఆస్ట్రేలియా 'సైన్య' సహకారం!
కాన్ బెర్రా: ఇరాక్ లోని పేట్రేగుతున్న ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద దాడులను తిప్పికొట్టేందుకు ఆస్ట్రేలియా బలగాలు సమాయత్తమయ్యాయి. మధ్య తూర్పు ఇరాక్ కు తమ దేశం నుంచి భారీగా బలగాలను పంపడానికి నిర్ణయించినట్లు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తెలిపారు. ఈ మేరకు అగ్రరాజ్యం అమెరికా నుంచి విన్నపం వచ్చిన నేపథ్యంలో తమ సైన్యాన్ని పంపడానికి సిద్దమైనట్లు ఆయన స్పష్టం చేశారు. ఇస్లామిక్ రాజ్యం స్థాపనే లక్ష్యంగా ఇరాక్ లో దాడులకు పాల్పడుతున్నఐఎస్ ఉగ్రవాదులను తిప్పికొట్టేందుకు అమెరికా సిద్ధమైన క్రమంలో ఆస్ట్రేలియా సహకారం కోరింది. ఇందుకు ఆస్ట్రేలియా 600 సైనిక బలగాలను, 8 అత్యుత్తమ వైమానిక దళాలను తమ దేశం నుంచి పంపడానికి సిద్ధమైంది. ఇరాక్, సిరియాలలో ఆక్రమణలకు పాల్పడుతూ దాడులకు తెగబడుతున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎల్ ను దెబ్బతీసి అంతిమంగా నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల ఏరివేతలో సమగ్ర వ్యూహ రచనతో ముందుకెళ్తామని గురువారం ‘వైట్‌హౌస్’ నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి 15 నిమిషాలపాటు చేసిన టీవీ ప్రసంగంలో ఆయన ప్రకటించారు. -
వైమానిక దాడులకు ఒబామా గ్రీన్ సిగ్నల్
-
వైమానిక దాడులకు ఒబామా గ్రీన్ సిగ్నల్
వాషింగ్టన్: ఇస్లాంలోకి మారండి లేదా మరణించండంటూ ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఇచ్చిన పిలుపుతో ఇరాక్‌లో నరమేథం సాగుతోంది. దాంతో వేలాది ప్రాణాలు బలవుతున్నాయి. ఇరాక్ మొత్తం రక్తసిక్తంగా మారింది. ఇప్పటికే ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న 'తమ సైన్యాన్ని కాపాడుకోడానికి' లక్షిత వాయుదాడులు చేయాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తమ సైన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత.. ఆయనీ నిర్ణయం తీసుకుని ఒక ప్రకటన కూడా చేసేశారు. ఇరాక్‌లోని సైన్యానికి సహాయ సహకారాలు అందిస్తూ... ఆ దేశంలో ఉన్న అమెరికన్లు, ఇతర విదేశీయులకు అండగా ఉన్నామనే భరోసా కల్పించాలని కోరారు. అందులోభాగంగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులపై వైమానిక దాడులు చేసి అంతమొందించాలని ఒబామా ఆదేశించారు. దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో చాలామంది ప్రజలు ఆకలి తాళలేక అల్లాడిపోతున్నారు. దాంతో అలాంటి ప్రాంతాల్లో ఆకలి చావులు సంభవించకుండా ఉండేందుకు ఆహార పదార్థాలను కూడా హెలికాప్టర్ల ద్వారా పంపాలని ఒబామా చెప్పారు. కుర్దిష్ రాజధాని అర్బిల్ ప్రాంతంలో అమెరికా సైన్యాలు ప్రస్తుతం ఉన్నాయి. వారిని రక్షించుకోవడం ప్రధాన కర్తవ్యంగా అమెరికా ఈ చర్యలు మొదలుపెట్టింది. ఇస్లాంలోకి మారతారా లేక చస్తారా అంటూ ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఇరాక్‌లోకి అతిపెద్ద నగరమైన కోరకోష్లోని క్రిస్టియన్లను బెదిరించారు. దాంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ నగరాన్ని వదిలి పర్వత ప్రాంతాలకు తరలిపోయారు. ఆ నగరంలోకి ప్రవేశించేందుకు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఉక్కుపాదం మోపాలని ఒబామా ఉన్నతాధికారులను ఆదేశించారు.