Archaeology staff
-
మన జిల్లాలో అరుదైన శాసనం..!
సాక్షి, కడప కల్చరల్ : మన జిల్లాలో మరో శాసనం వెలుగుచూసింది. కడప నుంచి గండి వాటర్ వర్క్స్‌కు వెళ్లే దారిలో తూర్పునగల గుట్టపై మగ్దూమ్ సాహెబ్ కొట్టాల గ్రామంలో పురాతన శాసనం వెలుగులోకి వచ్చింది. యానాదులు ఉంటున్న ఈ గ్రామం కడప నగరం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి పురాతనమైన శిథిలమై మొండిగోడలు మాత్రమే మిగిలి ఉన్న ఆలయంలో మూడేళ్ల క్రితం వరకు భైరవేశ్వరస్వామి విగ్రహం తల మాత్రమే ఉండేది. దానికి స్థానికులు పూజలు చేసేవారు. కాగా 2015లో కడపకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు, ‘బాసట స్వచ్ఛంద సంస్థ’ అధ్యక్షులు మేరువ బాలాజీరావు ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన సభ్యులతో కలిసి పురాతన ఆలయాన్ని పునర్నిర్మించారు. భైరవేశ్వరుని నూతన విగ్రహాన్ని తయారు చేయించి మూలవిరాట్టుగా ప్రతిష్టించారు. ఆలయ ప్రాంగణంలో కనిపించిన భైరవేశ్వరుని శిథిల మూలమూర్తి, ఇతర దేవతా విగ్రహాలను ఆలయం చుట్టూ ప్రహరీగా నిలిపారు. వెలుగు చూసిందిలా... బాలాజీరావు ద్వారా సమాచారం తెలుసుకున్న ‘సాక్షి’ ప్రతినిధి ఆ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ వివరాలుగల శాసనాలు, ఇతర ఆనవాళ్ల గురించి ఆరా తీశారు. ఆలయం ఎదురుగా ముళ్లపొదల్లో ఉన్న శాసనాన్ని స్థానికులు బయటకు తీశారు. అందులోని లిపిని గమనించిన సాక్షి ప్రతినిధి దాన్ని చరిత్ర పరిశోధకులు విద్వాన్ కట్టా నరసింహులుకు పంపారు. ఆయన దాన్ని పరిశీలించి ఆ బండపై ‘శ్రీ సమరాదిత్య’ అన్న అక్షరాలు ఉన్నాయని తెలిపారు. ఆ పురాతన లిపిని మరింత స్పష్టంగా పరిశీలించేందుకు మైసూరు పురాతత్వశాఖ ప్రతినిధులకు పంపారు. దాంతో పాటు మరో ఇద్దరు చారిత్రక పరిశోధకులకు కూడా పంపారు. కాగా ఇంతవరకు చేసిన పరిశోధనలో జిల్లాలోని పెద్దముడియం గ్రామాన్ని సమరాదిత్య తదితర ప్రభువులు పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆలయం వద్ద లభించిన బండపై గల అక్షరాలు తక్కువే అయినా దీని ద్వారా జిల్లాకు సంబంధించిన మరింత చరిత్ర లభించే అవకాశం ఉందని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు, చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. చరిత్ర వెలుగులోకి వస్తుంది... ఈ గ్రామంలోని శ్రీ భైరవేశ్వరస్వామి ఆలయాన్ని చూసిన పెద్దలంతా ఇది పురాతనమైన ఆలయమని చెబుతున్నారు. ప్రస్తుతం లభించిన ఈ శాసనంలోని వివరాలు తెలిస్తే గ్రామచరిత్రతోపాటు జిల్లా చరిత్ర కూడా మరికొంత వెలుగుచూసే అవకాశం ఉంది. – మేరువ బాలాజీరావు, అధ్యక్షులు, బాసట స్వచ్ఛంద సేవా సంస్థ, కడప -
నేడు గవర్నర్ రాక
రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ర్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ మంగళవారం జిల్లాకు రానున్నారు. జిల్లాలోని ప్రధాన ఆలయాలను సందర్శిస్తారు. కాకతీయ మిషన్ పనులను పరిశీలిస్తారు. బుధవారం ఉదయం హైదరాబాద్ వెళ్తారు.. ఈ సందర్భంగా గవర్నర్ పర్యటించే ఖిలా వరంగల్, రామప్ప ఆలయాల్లో ఏర్పాట్లను కలెక్టర్ వాకాటి కరుణ, ఎస్పీ అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు. - వెంకటాపురం/ఖిలా వరంగల్ వెంకటాపురం/ఖిలావరంగల్ : చారిత్రక రామప్ప దేవాలయం, ఖిలావరంగల కోటలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ వాకాటి కరుణ సోమవారం పరిశీలించారు. ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ, క మిషనర్ సర్పరాజ్ అహ్మద్ తదితరులతో కలెక్టర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కోటలో కాకతీయు వైభవాన్ని వివరించే సౌండ్ లైటింగ్ షోను తిలకించారు. తహసీల్దార్ రవి, నగర డీఎస్పీ సురేంద్రనాధ్, సీఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం రామప్పలో చేపట్టబోయే ఏర్పాట్లను పరిశీలించారు. రామప్ప ఆలయ ఆవరణలో చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రపరచాలని పురావస్తుశాఖ సిబ్బందికి సూచించారు. అనంతరం రామప్ప సరస్సు కట్టకు చేరుకుని హరిత హోటల్‌ను పరిశీలించారు. కట్ట నుంచి హోటల్ వరకు ఇరువైపుల ఉన్న పిచ్చిమొక్కలను తొలగించాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట దేవాదాయ శాఖ ఆసిస్టెంట్ కమిషనర్ సాయిబాబా, ములుగు ఆర్డీఓ చీమలపాటి మహేందర్‌జీ, ములుగు డీఎస్పీ రాజమహేంద్రనాయక్, సీఐ శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ మర్కాల రజని, ఎంపీడీఓ రాధిక, ఈజీఎస్ ఎపీఓ నారగోని సునీత, వెంకటాపురం ఎస్సై భూక్య రవికుమార్, స్థానిక సర్పంచ్ కారుపోతుల పూలమ్మ ఉన్నారు. రామలింగేశ్వరస్వామికి పూజలు రామప్పలోని రామలింగేశ్వరస్వామికి కలెక్టర్ వాకాటి కరుణ, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ చిందం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాన పూజారి కోమల్లపల్లి హరీష్‌శర్మ వారిని శాలువాలతో సత్కరించారు. అనంతరం టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్‌చే ఆలయ శిల్పకళాసంపద గురించి అడిగి తెలుసుకున్నారు.