Arjun daughter
-
తెలుగు పాఠాలు
యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అర్జున్ ఇప్పుడు ఓ పెద్ద ప్లాన్‌లో ఉన్నారు. తన కుమార్తె ఐశ్వర్యా అర్జున్‌ని తెలుగుకి పరిచయం చేయాలన్నదే ఆ ప్లాన్. అర్జున్ కన్నడ అయినప్పటికీ తెలుగులోనూ మంచి మంచి సినిమాలు చేశారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ తెలుగు సినిమాలు చేస్తున్నారాయన. తెలుగు ఇండస్ట్రీ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అంటున్న అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యా అర్జున్‌ని తెలుగులోకి పరిచయం చేయాలనుకుంటున్నారు. ఐశ్వర్య హీరోయిన్గా అర్జున్ తెలుగులో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఓ అగ్ర తెలుగు నిర్మాతతో కలిసి ఆయన ఈ సినిమా రూపొందించనున్నారట. ఈ సినిమా కోసమే ఐశ్వర్య తెలుగు నేర్చుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికే తమిళ, కన్నడ చిత్రాల్లో కథానాయికగా నటించి, మంచి నటి అనిపించుకున్న ఐశ్వర్య ఇప్పుడు టాలీవుడ్లో తనను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం మలయాళ ‘ఇష్క్’ కన్నడ రీమేక్‌లో నటిస్తున్నారు ఐశ్వర్య. ఇక టాలీవుడ్ ఎంట్రీ గురించి త్వరలో అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారట. -
హీరో దర్శకత్వం.. కూతురు హీరోయిన్
తండ్రి దర్శకత్వంలో కూతురు కథానాయికగా నటించడం అనేది అరుదైన విషయమే. యాక్షన్ కింగ్ అనగానే గుర్తొచ్చేది నటుడు అర్జునే. ఆయనలో నటుడే కాకుండా మంచి దర్శకుడు ఉన్నాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అర్జున్ కూతురు ఐశ్వర్య ఇంతకు ముందే పట్టత్తు యానై అనే చిత్రంలో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. విశాల్ హీరోగా నటించిన ఆ చిత్రం ఆమెకు ఆశించిన విజయాన్ని అందించలేదు. దీంతో తదుపరి చిత్రంపై ఆచి తూచి అడుగేస్తున్న ఐశ్వర్య అర్జున్ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. విశేషం ఏమిటంటే ఆమె హీరోయిన్గా నటిస్తున్న చిత్రానికి అర్జున్ దర్శకత్వం వహించనున్నారు. ఇది తమిళం, కన్నడ భాషలలో తెరకెక్కనుంది. దీని గురించి ఐశ్వర్య తెలుపుతూ తన తొలి చిత్రం పట్టత్తు యానై తరువాత పలు అవకాశాలు వచ్చినా మంచి కథా పాత్ర కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు తన తండ్రి దర్శకత్వం వహిస్తున్న ద్విభాషా చిత్రంలో నటించనున్నట్లు వెల్లడించారు. ఇది ప్రేమ కథా చిత్రంగా ఉంటుందన్నారు. కన్నడ నటుడు చేతన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తనపాత్ర చాలా భిన్నంగాను, నూతనంగాను ఉంటుందన్నారు. చిత్రాన్ని ఈ నెలాఖరులో ప్రారంభించడానికి సన్నాహాలు చేసినట్లు అయితే తుపాను కారణంగా జనవరికి వాయిదా వేసినట్లు ఐశ్వర్య వివరించారు.