పెషావర్ మృతులకు పార్లమెంట్ శ్రద్ధాంజలి
న్యూఢిల్లీ : పాకిస్తాన్ పెషావర్ లో ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిని పార్లమెంట్ ఉభయ సభలు బుధవారం ఖండించాయి. మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉభయసభల్లో సభ్యులు రెండు నిమిషాల పాటూ మౌనం పాటించారు. అనంతరం మత మార్పిళ్ల అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది.
ప్రధాని మోదీ సభకు వచ్చి ఈ అంశంపై ప్రకటన చేసేదాకా సభ సజావుగా సాగనివ్వబోమని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి... సభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. దాంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను మధ్యాహానానికి వాయిదా వేశారు.