arnold palmer
-
గోల్ఫ్ దిగ్గజం పామర్ కన్నుమూత
వాషింగ్టన్: గోల్ఫ్ దిగ్గజం ఆర్నాల్డ్ పామర్ (87) ఆదివారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ‘ఆర్నాల్డ్ గోల్ఫ్ క్రీడకు అత్యుత్తమ అంబాసిడర్. తన ఆటతీరుతో ఎంతోమందిని ఈ గేమ్ వైపు ఆకర్షితులను చేశారు. నిజానికి ఆర్నాల్డ్ వల్లే గోల్ఫ్ అభివృద్ధి చెందిందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని యూఎస్ గోల్ఫ్ సంఘం ఘనంగా నివాళి అర్పించింది. 1954లో ప్రొఫెషనల్‌గా మారిన ఆయన 2006లో రిటైర్ అయ్యారు. పామర్ను అభిమానులు ముద్దుగా ‘కింగ్’ అని పిలుస్తారు. -
గోల్ఫ్ దిగ్గజ ఆటగాడు మృతి
వాషింగ్టన్: గోల్ఫ్ లెజెండ్ ఆటగాడు ఆర్నాల్డ్ పామర్(87) ఆదివారం కన్నుమూశారు. పామర్ మృతిపట్ల సంతాపం తెలుపుతూ యూఎస్ గోల్ఫ్ అసోసియేషన్ ట్విట్టర్లో ఓ ప్రకటన విడుదల చేసింది. పామర్ తన కెరీర్లో ఏడు మేజర్ టోర్నమెంట్లను గెలుపొందారు. మాస్టర్స్ టోర్నీని నాలుగు సార్లు గెలిచిన ఆయన బ్రిటిష్ ఓపెన్‌ను రెండుసార్లు, యూఎస్ ఓపెన్‌ను ఒకసారి గెలుపొందారు. గోల్ఫ్ క్రీడకు ఆదరణను పెరగడంలో ఆర్నాల్డ్ పామర్ పాత్ర కీలకమైంది. గోల్ఫ్ తొలితరం టెలివిజన్ సూపర్ స్టార్లలో పామర్ ఒకరు.