ఆర్నాల్డ్ వస్తున్నారు!
హాలీవుడ్ యాక్షన్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ తొలిసారిగా ఓ దక్షిణాది సినిమా ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఆస్కార్ వి. రవిచంద్రన్ నిర్మిస్తోన్న ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) ఆడియో వేడుక సెప్టెంబర్ 15న భారీ ఎత్తున జరగనుంది. నిర్మాత రవిచంద్రన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రమేశ్‌బాబు ఇటీవలే ఆర్నాల్డ్‌ని కలిసి ‘ఐ’ ప్రచార చిత్రాన్ని చూపిస్తే, ఆయన విజువల్ వండర్ అని ప్రశంసించారట.