దిల్సుఖ్నగర్లో ఘరానా మోసం
హైదరాబాద్: దిల్సుఖ్నగర్లోని ఆర్యన్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉద్యోగాలని మభ్యపెట్టి కోర్సు పేరుతో రూ. కోట్లు వసూలు చేశారు. కాలేజీ యజమాని విద్యార్థులను హోటల్ మేనేజ్మెంట్ కోసం 30 మంది విద్యార్థులను మాల్దీవులకు పంపాడు. అక్కడి ఓ హోటల్లో 30 రోజులుగా బస ఏర్పాటు చేసి యజమాని నారాయణరెడ్డి పరారయ్యాడు. మోసపోయామని తెలుసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. కాలేజీలో ఉన్న అద్దాలను ధ్వంసం చేశారు. ఈ విషయం గురించి మలక్పేట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.