ఆశాభోంస్లే @ 80
ముంబై: ఆమె పాటలు హాయిగా ఉంటాయి, హుషారెక్కిస్తాయి, హృదయాన్ని హత్తుకుంటాయి. అందుకే ఆశాభోంస్లే స్వరమంటే అందరికీ అంతిష్టం. 80 వసంతాలు పూర్తిచేసుకున్న ఆశాజీ, ఇప్పటికీ పెప్పీ నెంబర్స్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. 1943లో గాయకురాలిగా ప్రారంభమైన ఆమె కెరీర్ ఆరు దశాబ్ధాలకు పైగా సాగింది. హిందీతో పాటు 20 భారతీయ భాషల్లో ఆశా పాటలు పాడారు.
2011లో మోస్ట్ రికార్డెడ్ ఆర్టిస్టుగా గిన్నిస్కెక్కారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మవిభూషణ్‌తో పాటు లెక్కలేనన్ని అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఫుడ్ బిజినెస్‌లో ఆశాజీ బిజీగా ఉన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.