కళామతల్లి ముద్దుబిడ్డ తలమర్ల
ప్రముఖ సాహితీ వేత్త ఆశావాది ప్రకాశరావు
అనంతపురం కల్చరల్ : సాహిత్యాని కి ఊపిరిగా నిలి చి న వారిలో తల మర్ల కళానిధి ఒకరని ప్రముఖ సాహి తీ వేత్త ఆశావాది ప్రకాశరావు అ న్నా రు. స్థానిక ఆర్ట్ క ళాశాలలో ఆదివారం సాహితీ స్రవంతి, ఆర్ట్స్ కళాశాల తెలుగు వి భా గం సంయుక్తంగా విద్వాన్ తలమర్ల కళానిధి శత జయంతి నిర్వహిం చారు. సాహితీ స్రవంతి నగర అధ్యక్షుడు నీరుగంటి వెంకటేష్ అ« ద్యక్ష త వహించారు. ఆశావాది ప్రకాశరావు మాట్లాడుతూ కష్టనష్టాలను దాటుకుని దళిత కవికోకిలగా స్థిరపడడం తలమర్లకే చెల్లిందన్నారు. దళితులు బానిసత్వం నుండి విముక్తి పొందాలంటే చదువు ఒక్కటే మా ర్గమన్న ఆయన రచనలను అందరూ చదివాలని అభిప్రాయపడ్డారు. కళానిధి కుమారుడు విశ్రాంత డీఎస్పీ తలమర్ల శ్యాంసుందర్ మాట్లాడుతూ తన తండ్రి పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి విద్యా, వైద్య, సాహితీ రంగాల్లో కృషి చేసిన వారిని ప్రోత్సహిస్తామన్నారు. సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు ప్రగతి, ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, పం డిట్ సూర్యనారాయణరెడ్డి ,మధురశ్రీ, జూటూరు షరీఫ్ పాల్గొన్నారు.