గోవాలో ఇరానీయన్ చిన్నారిపై అత్యాచారం
ముంబైకు చెందిన అశ్లీ క్రస్టా అనే వ్యక్తి నాలుగేళ్ల చిన్నారి ఇరానీయన్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన గోవా రాజధాని పనాజీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అశ్లీ క్రస్టా గత కొద్ది నెలలుగా ఇరానీయన్ మహిళలో డేటింగ్ చేస్తున్నాడు. ఆ మహిళకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. కాగా ఇరానీయన్ మహిళ ఇంట్లోలేని సమయంలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తన తల్లికి ఆ చిన్నారి ఏడుస్తూ అసలు విషయాన్ని వెల్లడించింది. దీంతో తల్లి కుమార్తెను తీసుకుని పనాజీ పోలీసులకు ఆశ్రయించింది. అశ్లీ క్రిస్టాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అశ్లీపై పనాజీ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పనాజీ ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై అత్యాచార ఘటన సోమవారం చోటు చేసుకుంది.