రేషన్ షాపులే మినీ బ్యాంకులు
► తెరపైకి రేషన్ షాపు బ్యాంకుల లావాదేవీలు
► డీలర్లకు మైక్రో ఏటీఎంలు అందించేందుకు సిద్ధం
► మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స డైరక్టర్ అశోక్ కుమార్ సింగ్ నుంచి ఆదేశాలు జారీ
► డీలర్లతో సమావేశమైన జేసీ, లీడ్‌బ్యాంక్ మేనేజర్, ఎన్ఐసీ అధికారులు
విజయనగరం కంటోన్మెంట్: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో ప్రజానీకం అతలాకుతలం అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రేషన్ డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించనున్నది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స డెరైక్టర్ అశోక్ కుమార్ సింగ్ ఆదేశాలతో హుటాహుటిన డీలర్లతో జిల్లా అధికారులు సమావేశాన్ని నిర్వహించి బిజినెస్ కరస్పాండెంట్లుగా కొద్ది పాటి మొత్తాలకు పనిచేయాలని సూచనలు చేశారు. వీరి ద్వారా గ్రామాల్లో పరిమిత నగదు లావాదేవీలను నిర్వహింపజేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లతో మినీ కాన్ఫరెన్స హాలులో జారుుంట్ కలెక్టర్ శ్రీకేశ్ బి.లఠ్కర్, లీడ్ బ్యాంకు మేనేజర్ గురవయ్య, ఎన్ఐసీ అధికారులు బుధవారం సమావేశాన్ని నిర్వహించారు.
రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బుగత వెంకటేశ్వర రావు, జిల్లా ఉపాధ్యక్షుడు సముద్రపు రామారావులతో బిజినెస్ కరస్పాండెంట్లుగా ఉండేందుకు ఎంత మంది రేషన్ డీలర్లు ఆసక్తిగా ఉన్నారో చర్చించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పరిమిత నగదు లావాదేవీలతో బ్యాంకింగ్ చేసేందుకు అర్హులైన డీలర్లు ముందుకు రావాలన్నారు. వీరికి రూ.ఐదారు వేల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ గురవయ్య మాట్లాడుతూ గ్రామాల్లోని రేషన్ షాపులే ఇక బ్యాంకు లావాదేవీలను పరిమితంగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. బిజినెస్ కరస్పాండెంట్లు తమ పరిధిలో నెలలో కనీసం 20 రోజులు అందుబాటులో ఉండాలని, అదనపు వ్యాపార ప్రతినిధిగా పేరు నమోదు చేసుకోవాలని ఆయనతెలిపారు.
ఆరుగురు సభ్యులతో కమిటీ..
డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించేందుకు జిల్లా స్థారుులో ఓ కమిటీ ఉంటుంది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గానూ లీడ్ జిల్లా మేనేజర్ కన్వీనర్‌గానూ వ్యవహరిస్తారు. మరో నలుగురు అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు.
డీలర్లకు మైక్రో ఏటీఎంలు
బిజినెస్ కరస్పాండెంట్లుగా లావాదేవీలు నిర్వహించేందుకు చేతిలో ఇమిడే మైక్రో ఏటీఎంలను రేషన్ డీలర్లకు అప్పగించేందుకు సిద్ధం చేశారు. వీటిని ఎన్ఐసీ, జేసీ, డీఎస్ఓ తదితర అధికారులతో కలసి సమన్వయంతో పనిచేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశంలో ఏఎస్ఓలు పి.నాగేశ్వరరావు, ఆర్.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.