తుపాను సాయంలో కోత
పెంచిన ఐదు రోజులకే 60 శాతం పైగా తగ్గింపు
హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులకు సహాయంలో అప్పుడే కోతలు ఆరంభమయ్యాయి. ఈ మేరకు స్కేల్ ఆఫ్ అసిస్టెన్స్కు (సహాయ ప్యాకేజీ) సవరణలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హుదూద్సృష్టించిన విధ్వంసంలో ఇళ్లతో పాటు సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన వారికి తక్షణం ఇచ్చే సహాయ ప్యాకేజీని పెంచుతూ ప్రభుత్వం ఈనెల 12వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతలోనే సహాయంలో 60 శాతానికి పైగా కోత విధిస్తూ సవరణ ఉత్తర్వులు ఇచ్చింది.