అటవీ కొలువుల సమగ్ర సమాచారం
సర్కారు కొలువు కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగ యువతీయువకులకు సువర్ణావకాసాన్ని కల్పిస్తూ రాష్ట్ర అటవీశాఖ మొత్తం 2,167 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్, ఫారెస్టు బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తానాదార్, బంగళా వాచర్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలున్నాయి.
టెక్నికల్ అసిస్టెంట్ రాత పరీక్షలో పేపర్ ఐ మినహా మిగిలిన అన్ని ఉద్యోగాలకు ఒకటే సిలబస్ ఉంటుంది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్టు బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వేర్వేరు ప్రశ్న పత్రాలు ఉంటాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తానాదార్, బంగళా వాచర్ ఉద్యోగాలకు ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది.
అయితే ఉద్యోగాలను బట్టి ప్రశ్నలడిగే స్థాయిలో తేడా ఉంటుంది. పేపర్ I లో ఎస్సే రైటింగ్, పేపర్ II లో జనరల్ నాలెడ్జ్, పేపర్ III లో పదో తరగతి వరకు గల జనరల్ మ్యాథమేటిక్స్‌పై ప్రశ్నలు వస్తాయి. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి పేపర్ I లో ఐటీఐలో డ్రాఫ్ట్‌మన్ (సివిల్) సిలబస్ ఉంటుంది.
సిలబస్‌ను పక్కాగా తెలుసుకుని, ఒక క్రమ పద్ధతిలో చదివితే అటవీ కొలువు మీ సొంతమవుతుంది. అటవీ శాఖ రాత పరీక్షకు అవసరమయ్యే సిలబస్‌కు సంబంధించి మొత్తం అంశాలను సాక్షి ఎడ్యుకేషన్ మీకు అందిస్తుంది. నిపుణుల సహాయంతో అందించిన జనరల్ ఎస్సేలు, పేపర్ II, పేపర్ III బిట్ బ్యాంక్స్, మాక్ టెస్టులు సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్ www.sakshieducation.com లో అందుబాటులో ఉన్నాయి.