అసోంలో తొలిసారిగా 'కమల' వికాసం!
గువాహటి: అసోంలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రానుందని ఎగ్జిల్ పోల్స్ అంచనా వేశాయి. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు అసోం ఓటర్లు చరమగీతం పాడబోతున్నారని వెల్లడించాయి. 126 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి 79 నుంచి 93 సీట్లు గెల్చుకునే అవకాశముందని ఇండియాటుడే-యాక్సిస్ సర్వే తెలిపింది. కాంగ్రెస్ కు 26 నుంచి 33, ఏఐయూడీఎఫ్ కు 6-10 స్థానాలు దక్కే అవకాశముందని వెల్లడించింది.
బీజేపీ కూటమికి 81, కాంగ్రెస్ 33, ఏఐయూడీఎఫ్ 10 సీట్లు గెల్చుకునే అవకాశముందని ఏబీపీ-ఆనంద సర్వే అంచనా వేసింది. బీజేపీ కూటమి 57, కాంగ్రెస్ 41, ఏఐయూడీఎఫ్ 18, ఇతరులు 10 చోట్ల విజయం సాధిస్తారని సీఓటర్ సర్వే తెలిపింది. బీజేపీ కూటమి 90, కాంగ్రెస్ 27, ఏఐయూడీఎఫ్ 9 స్థానాల్లో గెలిచే అవకాశముందని అసోం టుడేస్ చాణక్య సర్వే వెల్లడించింది. ఈనెల 19న కౌంటింగ్ జరగనుంది.