‘పతంజలి నూడుల్స్ నాసిరకం’
మీరట్: పతంజలి ‘ఆటా నూడుల్స్’ నాసిరకంగా ఉన్నాయని ఆహార భద్రత, ఔషధాల నిర్వహణ(ఎఫ్ఎస్డీఏ) సంస్థ తేల్చింది. వాటిలో మోతాదుకు మించి మూడురెట్లు బూడిద శాతం ఉందని పేర్కొంది. ఫిబ్రవరి 5న మీరట్లో పతంజలి, మ్యాగీ, యిపీ నూడుల్స్ నమూనాలను పరీక్ష కోసం సేకరించారు. మూడు కంపెనీల నమూనాల్లో బూడిద శాతం మోతాదుకన్నా అధికంగా ఉన్నట్లు తేలింది. నిబంధనల ప్రకారం నూడుల్స్లో బూడిద 1 శాతం ఉండాలి.