ఎస్బీహెచ్ ఉద్యోగి మోసం
ఖాతాదారు నుంచి రూ.22 వేలు కాజేసి వైనం
ఆలస్యంగా వెలుగులోకి
ఏటూరునాగారం : ఓ వ్యక్తి ఖాతా నుంచి డబ్బులు కాజేసిన ఎస్బీహెచ్ ఉద్యోగి వ్యవహారం గురువారం వెలుగుచూసింది. ఏటూరునాగారం మండలంలోని ఆకులవారిఘణపురం గ్రామానికి చెందిన అటిక కృష్ణ వడ్రంగి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంతలో కృష్ణకు మంగళవారం ఒక ఫోన్‌కాల్ వచ్చింది. నేను బ్యాంకు ఎంప్లారుుని ‘నీ ఏటీఎం పిన్ నంబర్ బ్లాక్ అరుుంది. మీ పిన్ నంబర్, కార్డుపై ఉన్న 11 అంకెల నంబర్, అకౌంట్ నంబర్ చెప్పాలని కాల్చేసిన వ్యక్తి కృష్ణను కోరాడు.
నమ్మిన ఆయన అన్ని వివరాలు తెలిపాడు. బుధవారం రోజు కృష్ణ అకౌంట్లోని రూ.22 వేలు డ్రా అయ్యూరుు. గృహ ఉపకార సామగ్రి కొనుగోలు చేసినట్లుగా సెల్‌కు ఎస్ఎంఎస్ వచ్చింది. ఇది చూసి కృష్ణ ఖంగుతిన్నాడు. ‘ నేను గృహానికి కావాల్సిన ఫర్నిచర్ ఎందుకు కొన్నాను’అని పునరాలోచనలో పడ్డాడు. వెంటనే ఎస్‌బీహెచ్‌కు వెళ్లి తన ఖాతా నుంచి రూ.22 వేలు డ్రా అయ్యూయని బ్యాంకు అధికారులకు తెలిపాడు. వివరాలు సేకరించగా ఎస్బీహెచ్ ఉద్యోగి రావుల్శర్మ డబ్బులు డ్రా చేసినట్లు తేలింది. దీంతో బాధితుడు వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు ఉద్యోగి ఆచూకీ దొరకలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.