attack with slipper
-
బ్లాక్ లిస్టులో శివసేన ఎంపీ
ముంబై: ఎయిర్ ఇండియా సిబ్బందిపై భౌతికంగా దాడి చేసిన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఎయిర్ ఇండియాకు చెందిన డ్యూటీ మేనేజర్‌ను 25 సార్లు చెప్పుతో కొట్టినందుకు అతనిపై కంపెనీ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా అతన్ని ఆ సంస్థ బ్లాక్‌లిస్టులో చేర్చింది. అయితే ఈ నిషేధం ఎన్ని రోజుల వరకు కొనసాగుతుందనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. మరోవైపు గైక్వాడ్ పేరును బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ భావిస్తోంది. ప్రస్తుతం ఎఫ్ఐఏ పరిదిలో జెట్ ఎయిర్వేస్, ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ సంస్థలు సేవలందిస్తున్నాయి. అంటే గైక్వాడ్ పేరు బ్లాక్ లిస్ట్‌లో పెడితే ఆయన ఈ నాలుగు సంస్థల విమానాల్లో ప్రయాణించే అవకాశం కోల్పోతారు. కాగా ఎఫ్ఐఏ నుంచి ఎయిర్ఇండియా ఇటీవలే బయటకు వచ్చేసింది. కాగా భారతీయ విమాన సంస్థలు సిబ్బంది భద్రత దృష్ట్యా అసభ్యంగా ప్రవర్తించేవారిని బ్లాక్‌లిస్టులో పెట్టే నియమం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎవరిని బ్లాక్‌లిస్టులో చేర్చలేదు. బ్లాక్ లిస్టులో నిలిచిన తొలి వ్యక్తిగా ఎంపీ గైక్వాడ్ నిలిచారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ గైక్వాడ్ మాత్రం ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎయిర్ ఇండియా సిబ్బంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోనే అలా చేశానని ఆయన మీడియాకు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ఎయిర్ ఇండియా మేనేజరే తనకు ఎదురు క్షమాపణ చెప్పాలని గైక్వాడ్ డిమాండ్ చేశారు. బిజినెస్ క్లాస్ టికెట్ కలిగిన తనకు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణ సదుపాయం కల్పించారన్న ఆవేశాన్ని ఆపుకోలేక ఎంపీ నిన్న పుణె-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో డ్యూటీ మేనేజర్‌పై చెప్పుతో దాడి చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా గైక్వాడ్‌ను శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ఆదేశించారు. -
చెప్పుతో భర్త తాటతీసింది!
-
చెప్పుతో భర్త తాటతీసింది!
గ్వాలియర్: భర్త ఎలాంటి తప్పు చేసినా భరిస్తారో లేదో కానీ, ఇతర మహిళతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తే మాత్రం అపరకాళికలా మారిపోతారు. సరిగ్గా ఇలాంటి సంఘటన ఇటీవల మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటుచేసుకుంది. ఇతర మహిళతో సంబధం పెట్టుకుంటావా అంటూ చేత చెప్పుతో రోడ్లపై భర్తను పరుగులు పెట్టించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. గ్వాలియర్ కు చెందిన పుష్ప, మనీశ్ అగర్వాల్ ప్రేమించుకున్నారు. పోలీసులు, కోర్టును ఆశ్రయించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లు అన్యోన్యంగా ఈ జంట కలిసి ఉన్నారు. కొన్ని నెలలుగా మనీశ్ వ్యవహారం పుష్ప ఆశించినట్లుగా ఉండటం లేదు. అసలు ఏమైందో తెలియదు కానీ, ఇంటికి రావడం తగ్గించాడు. రెండు నెలలుగా మనీశ్ వ్యవహారాన్ని గమనించిన భార్యకు అనుమానమోచ్చింది. భర్త మనీశ్ కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకుంది. తన బంధువుల సాయంతో మనీశ్ ను పట్టుకుని, ఈ విషయంపై కడిగి పారేసింది. వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. చిన్నపిల్లల్లా వ్యవహరించవద్దని ఇంటికి వెళ్లి హాయిగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇదే అవకాశమని భావించిన మనీశ్, పుష్ప నుంచి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. మరోసారి రోడ్లపై భార్యాభర్తలు గొడవపడ్డారు. భర్తపై పుష్ప విరుచుకుపడి చెప్పుతో దాడికి ప్రయత్నించింది. మనీశ్ రోడ్లపై పరుగు అందుకోగానే చెప్పు చేతపట్టిన పుష్ప కూడా భర్తను తరుముతూ హల్ చల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది.