attempts suicide
-
మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: మల్లారెడ్డి వర్శిటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఉమెన్స్ క్యాంపస్‌లో ఆత్మహత్యకు యత్నించింది. కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేందుకు కిటికీ నుంచి దూకేందుకు యత్నించింది.గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కాపాడటంతో ప్రాణాపాయం తప్పింది. పరీక్ష ఫెయిల్ అవుతాననే భయంతో ఆ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా సమాచారం. -
భార్య కాపురానికి రావడంలేదని.. సెల్‌టవర్ ఎక్కాడు
చిన్నశంకరంపేట: భార్య కాపురానికి రావడంలేదని ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. చనిపోతానంటూ బెదిరించాడు. చాకచర్యంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మండల కేంద్రమైన చిన్నశంకరంపేటలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన కిచ్చుగారి ప్రభాకర్‌కు పాపన్నపేటకు చెందిన లక్ష్మితో వివాహం జరిగింది. మూడేళ ్ల క్రితం ప్రభాకర్‌తో గోడవపడి తల్లిగారింటికి వెళ్లింది. అయితే కాపురానికి రావాలని నాటి నుంచి ఆమెను కోరుతుండగా నిరాకరించింది. దీంతో మానసిక క్షోభకు గురైన ప్రభాకర్ ఆదివారం స్థానిక రైస్‌మిల్ పక్కన ఉన్న సెల్ టవర్‌ను ఎక్కాడు. అతడిని గమనించిన స్థానికులు కిందకు దిగాల్సిందిగా ప్రభాకర్ కోరారు. విషయం పోలీస్‌లకు అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న ఎస్ఐ నగేష్ యువకుడితో ఫోన్లో మాట్లాడుతూ విషయంపై ఆరా తీశాడు. యువకుడి భార్యను రప్పించేందుకు ఎర్పాట్లు చేస్తున్నానని మాటల్లో పెట్టిన ఎస్ఐ ఇద్దరు యువకులను టవర్‌పైకి పంపించారు. టవర్‌పైకి వెళ్లిన యువకులు ప్రభాకర్‌ను సమాదాయించినా వినలేదు. దీంతో ఎస్ఐ నగేష్ పాపన్నపేట ఎస్ఐ శ్రీకాంత్‌కు ఫోన్ చేసి యువకుడితో మాట్లాడించారు. దీంతో యువకుడు శాంతించి కిందకు వచ్చాడు. అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం తల్లి,తండ్రులకు యువకుడిని అప్పగించారు. దీంతో కథ సుఖాంతమైంది.