భార్య కాపురానికి రావడంలేదని.. సెల్‌టవర్ ఎక్కాడు | man attempts to suicide after that wife rejected sharing life with him | Sakshi
Sakshi News home page

భార్య కాపురానికి రావడంలేదని.. సెల్‌టవర్ ఎక్కాడు

Published Mon, Jan 12 2015 9:12 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

man attempts to suicide after that wife rejected sharing life with him

చిన్నశంకరంపేట: భార్య కాపురానికి రావడంలేదని ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. చనిపోతానంటూ బెదిరించాడు. చాకచర్యంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మండల కేంద్రమైన చిన్నశంకరంపేటలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన కిచ్చుగారి ప్రభాకర్‌కు పాపన్నపేటకు చెందిన లక్ష్మితో వివాహం జరిగింది. మూడేళ ్ల క్రితం ప్రభాకర్‌తో గోడవపడి తల్లిగారింటికి వెళ్లింది. అయితే కాపురానికి రావాలని నాటి నుంచి ఆమెను కోరుతుండగా నిరాకరించింది. దీంతో మానసిక క్షోభకు గురైన ప్రభాకర్ ఆదివారం స్థానిక రైస్‌మిల్ పక్కన ఉన్న సెల్ టవర్‌ను ఎక్కాడు. అతడిని గమనించిన స్థానికులు కిందకు దిగాల్సిందిగా ప్రభాకర్ కోరారు. విషయం పోలీస్‌లకు అందించారు.

 

దీంతో అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ నగేష్ యువకుడితో ఫోన్‌లో మాట్లాడుతూ విషయంపై ఆరా తీశాడు. యువకుడి భార్యను రప్పించేందుకు ఎర్పాట్లు చేస్తున్నానని మాటల్లో పెట్టిన ఎస్‌ఐ ఇద్దరు యువకులను టవర్‌పైకి పంపించారు. టవర్‌పైకి వెళ్లిన యువకులు ప్రభాకర్‌ను సమాదాయించినా వినలేదు. దీంతో ఎస్‌ఐ నగేష్ పాపన్నపేట ఎస్‌ఐ శ్రీకాంత్‌కు ఫోన్ చేసి యువకుడితో మాట్లాడించారు. దీంతో యువకుడు శాంతించి కిందకు వచ్చాడు. అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం తల్లి,తండ్రులకు యువకుడిని అప్పగించారు. దీంతో కథ సుఖాంతమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement