Attribution
-
రేవంత్‌రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు
-
జనశక్తి నేత కూర రాజన్నపై ‘రాజద్రోహం’ తగదు
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క దోమలగూడ: జనశక్తి నాయకులు కూర రాజన్న తదితరులపై రాజద్రోహం ఆరోపణలతో నమోదైన కర్నూలు కుట్ర కేసును ఎత్తి వేసి బేషరతుగా విడుదల చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. దోమలగూడలోని అరుణోదయ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆమె మాట్లాడారు. కూర రాజన్న, మరో 11 మంది అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన నీలం రాంచంద్రయ్య స్మృతిలో ప్రజలు నిర్మించుకున్న రాంచంద్రయ్య స్మారక పాఠశాల ఒడిదుడుకులు ఎదుర్కొంటుండటంతో ఈ విషయాన్ని చర్చించడానికి హైదరాబాదు నుంచి వెళ్లిన కూర రాజన్న తిరుగు ప్రయాణంలో అనారోగ్యంతో కర్నూలులో ఆగాడన్నారు. రాజన్నతో పాటు కార్మిక సంఘం, రైతు కూలీ సంఘం నాయకులైన నంబి నర్సింహ్మయ్య, మోతా వెంకట్రావు, కర్నాకుల వీరాంజనేయులు, మాస్టారు నాగేందర్రావు, పెంచలయ్య, అందే బాలాజీలను అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి బలవంతంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అంతకుముందే కర్నూలులో నివాసముంటున్న రాంచంద్రయ్య స్మారక పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయుడు, బోల్లవరం గ్రామ మాజీ సర్పంచు ఒడ్డె పోతనను ఇంట్లో అరెస్టు చేశారని, పీఓడబ్ల్యూ కార్యాలయంలో రైతుకూలీ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు బోయ సుంకులును, కర్నూలు బస్టాండ్‌లో వసంత్, చాకలి శ్రీను అనే యువకులను పట్టుకున్నారని చెప్పారు. వీరందరిపై 121 ఎ, 120 బి సెక్షన్ల కింద రాజద్రోహం కుట్ర కేసులు నమోదు చేశారన్నారు. ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. ప్రజా సంఘాల నాయకులు విఠల్‌రాజ్ (ఏఐఎప్‌టియూ), హన్మేష్ (సీపీఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ), ఆవుల అశోక్, (పీడీఎస్‌యూ), మోహన్ బైరాగి (అరుణోదయ), రామలింగం (శోషిత జనసభ), నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు
అత్త, మామ, ఆడపడుచు, ఆడపడుచు భర్తే కారణం హోటల్లో శ్రీరామ్ మృతిపై అతని భార్య అనిల ఆరోపణ గాంధీనగర్ : తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతని మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని ఇటీవల ఓ హోటల్లో మృతి చెందిన వీరగంధం శ్రీరామ్ భార్య అనిల పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆమె శనివారం విలేకరులతో మాట్లాడారు. గుడివాడకు చెందిన తనకు 2004లో శ్రీరామ్‌తో వివాహమైందని, పదేళ్లుగా అమెరికాలో జీవిస్తున్నామని, పిల్లలు లేకపోవడంతో ఎవరినైనా దత్తత తీసుకుందామని అనుకున్నామని చెప్పారు. అయితే శ్రీరామ్ తల్లిదండ్రులు, అక్క, బావ నిరాకరించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్ 18న తాను, డిసెంబర్ 4న శ్రీరామ్ భారత్ వచ్చామని తెలిపారు. డిసెం బర్ 16న పెళ్లి రోజు జరుపుకొన్నామని చెప్పారు. జనవరిలో శ్రీరామ్ అమెరికా వెళ్లి, అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడాడని, అయితే ఈ నెల 10వ తేదీన గాంధీనగర్‌లోని ఓ హోటల్లో అతను ఆత్మహత్య చేసుకున్నాడని బంధువుల ద్వారా తెలిసిందని, తిరిగి ఎప్పు డొచ్చాడో తనకు తెలియదని రోధించారు. తన భర్త ఇండియాతో పాటు అమెరికాలోనూ ఆస్తులు సంపాదించారని, పిల్లలను దత్తత తీసుకుంటే ఆస్తులు వారికి దక్కుతాయనే ఉద్దేశంతోనే తన మామ వీరగంధం కామేశ్వరరావు, అత్త ఇందిర, ఆడపడుచు గౌతమి, ఆమె భర్త శ్రీధర్ తన భర్తను మానసికంగా హింసించారని ఆరోపించారు. తన భర్త మరణించిన హోటల్లో రెండు జతల దుస్తులే లభించాయని చెబుతున్నారని, పాస్‌పోర్టు, వీసా, ఐఫోన్ ఏమయ్యాయని ప్రశ్నిం చారు. అనిల తండ్రి పర్వతనేని నాగమోహనరావు మాట్లాడుతూ శ్రీరామ్ పేరుతో ఉన్న ఆస్తులను డిసెంబర్లోనే అతని తల్లిదండ్రులు తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆ విషయం తన అల్లుడు మృతి చెందాక తెలి సిందని అన్నారు. సమగ్ర దర్యాప్తుచేసి తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరారు.