సస్పెన్షన్ తొలగించినా కోచ్‌గా నియమించలేదు
వడోదరా: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్ అతుల్ బెదాడేపై విధించిన సస్పెన్షన్‌ను బరోడా క్రికెట్ సంఘం (బీసీఏ) తొలగించింది. అయితే సీనియర్ మహిళా జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి అతన్ని తప్పించింది. ఆరోపణల నేపథ్యంలో అతనిపై ప్రాథమిక విచారణ చేశాం. ఉన్నతస్థాయి కమిటీ... అతనిపై వచ్చిన ఆరోపణలు, జరిగిన విచారణపై చర్చించింది. అనంతరం ఈ సమస్యకు ముగింపు పలికిన కమిటీ బెదాడేపై సస్పెన్షన్‌ను తొలగించింది. అయితే సున్నితమైన ఈ అంశంపై వివాదం రేపకూడదన్న ఉద్దేశంతో మహిళా క్రికెట్ జట్టుకు కోచ్‌గా అతన్ని తప్పించింది’ అని బీసీఏ కార్యదర్శి అజిత్ లెలె తెలిపారు. త్వరలోనే బరోడా మహిళా జట్టుకు అంజూ జైన్‌ను హెడ్ కోచ్‌గా నియమించనున్నారు. (ఇక టెస్టులు ఆడటం నాకు సవాలే)