సాక్షి మెగా ఆటోషో ‘అదుర్స్’
పెదవాల్తేరు/ఎంవీపీకాలనీ : సాక్షి మెగా ఆటో షోకు విశేష స్పందన లభించింది. సొంతవాహనాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారికి ప్రముఖ షోరూం అన్ని ఒకే చోట కొలువు తీరడంతో వారి ఆనందానికి హద్దులులేకుండపోయాయి. నచ్చిన కంపెనీ వాహనం గురించి తెలుసుకునేందుకు వినియోగదారులు ఉత్సాహం చూపారు. చక్కని వినోద కార్యక్రమాల మధ్య ఆటో షో ఎంవీపీకాలనీ వుడా గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించారు. కార్యక్రమాన్ని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకష్ణబాబు ప్రారంభించారు. ఆదివారం కూడా ఈ మెగా షోను నిర్వహించనున్నారు. సరికొత్త వాహనాలను వినియోగదారుల చెంతకే చేర్చాలన్న లక్ష్యంతో ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్న సాక్షి మెగా ఆటో షో నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటుందని సాక్షి ఏజీఎం రంగనాథ్ తెలిపారు.
సరికొత్త ఉత్పాదనలు
సాక్షి మెగా ఆటో షోలో ప్రముఖ ఆటో మోబైల్ కంపెనీలైన శ్రీనివాస యమహా, కంటిపూడి నిషాన్, వరుణ్‌మోటార్స్, మేంగో హుండాయ్, రెనోల్ట్ వైజాగ్, లక్ష్మి హుండాయ్, జయభేరి మారుతి నెక్సా, వరుణ్‌బజాజ్, శివశంకర్ హీరో, సింగమ్ సుజుకీ, ఆరెంజ్ షెవ్రెలెట్,నియోన్ మోటార్స్, ఆలీవ్ టీవీఎస్, ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్, ఓరా వెస్పాల సరికొత్త ఉత్పాదనలు 28 స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శనలో ఉంచడం విశేషం. ఆసక్తికరమైన మోడల్స్, ఆకర్షణీయమైన రంగులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అన్ని శ్రేణుల వాహనాలు ఒకే చోట కొలువుదీరడంతో సందర్శకులకు కనువిందు చేశాయి.
ఆఫర్లే ఆఫర్లు
తొలి రోజు శనివారం ఆటోషోకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించడంతో ప్రముఖ కంపెనీల డీలర్లు, షోరూం అధినేతలు వాహన కొనుగోలుదారులకు మంచి ఆఫర్లను ప్రకటించారు. కొత్త స్కూటర్స్తోపాటు , 700 సీసీ స్పోర్ట్స్ బైక్‌లు. అలాగే మార్కెట్లో కొత్తగా లాంచింగ్ అయిన కార్లను ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటి డెమో డ్రైవ్ సదుపాయం కల్పించడంతో వాహన ప్రియులు వాటి స్వతహాగా డ్రైవ్ చేసి చక్కని అనుభూతి పొందారు. మరోవైపు వినియోగదారులకు సేదతీరేందుకు వీరుమామా టీం నేతత్వంలో కలర్‌ఫుల్ కల్చరల్ కార్యక్రమాలు అలరించాయి. మరోవైపు ఆటో ఎక్స్పోను సందర్శించివారికి నేచురల్ స్పా, సెలూన్స్ స్పాన్సరింగ్ చేసి చక్కని గిఫ్ట్ కూపన్లో నజరానాగా అందిస్తున్నారు. ఈ గిఫ్ట్ కూపన్లు ప్రతి గంటకు ఒక సారి లక్కీడ్రా ద్వారా తీస్తున్నారు. అంతేకాకుండా వినియోగదారులను ఆకర్షించేందుకు మగువలకు బ్యూటీఫికేషన్ కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి వారి అందాలకు మెరుగులు దిద్దుతున్నారు. అంతేకాకుండా నచ్చిన వాహన పేరు చటుక్కున చెప్పేవారి చక్కని బహుమతులు అందజేస్తున్నారు. కార్ల కొనుగోలు చేసేవారి కోసం పోటాపోటీగా ఆఫర్లు ప్రకటించారు. ఇన్సూరెన్స్ ఫ్రీతో పాటు, నమ్మశక్యంకాని అద్భుతమైన తగ్గింపులను ప్రకటించి వినియోగదారులు ఆకట్టుకుంటున్నారు. వాహనాలకు రుణ సదుపాయం కల్పించేందుకు ప్రముఖ బ్యాంకర్ల సైతం ఎక్స్పో లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేసి వినియోగదారులకు చక్కగా వివరిస్తున్నారు. ఎక్స్ పో తిలకించడానికి వచ్చిన మహిళలకు మెహెందీ ఉచితంగా డిజైన్ చేసేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు.దీంతో ఎక్స్ పో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుల్ జోష్‌గా జరిగింది.