డేవిడ్ వార్నర్‌కు గాయం
మెల్బోర్న్: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్‌కు దిగలేదు. ఉదయం నెట్స్‌లో ప్రాక్టీస్ సందర్భంగా అతని కుడి చేతికి గాయమైంది. దాంతో వాపు వచ్చినట్లు జట్టు మేనేజ్మెంట్ వెల్లడించింది. అతను రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయగలడా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
మార్ష్ అవుట్...
మరోవైపు తొడ కండరాల గాయంతో మూడో టెస్టుకు దూరమైన ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ సిడ్నీ టెస్టులోనూ ఆడే అవకాశం లేదు. స్కానింగ్ లో అతని గాయం తీవ్రత తెలిసిందని, ఈ సిరీస్‌లో అతను ఆడలేడని జట్టు ఫిజియో చెప్పారు.