గోరంతా నీలాలు...
నెయిల్ ఆర్ట్
ఇది ఆస్ట్రేలియన్ నెయిల్ ఆర్ట్. దీన్ని వేసుకోవడానికి ట్రాన్స్పరెంట్, బ్లూ, స్కై బ్లూ, వైట్, బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్‌లు కావాలి. చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఈ నెయిల్ ఆర్ట్‌ను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా లైట్ కలర్ డ్రెస్ ధరించినప్పుడు... ఈ ఆర్ట్ వేసుకుంటే అదిరి పోతుంది. ముందుగా గోళ్లన్నిటినీ శుభ్రం చేసుకొని, కింది విధంగా చేయండి.
1. అన్ని గోళ్లకూ ముందుగా బ్లూ కలర్ నెయిల్ పాలిష్‌ను పూర్తిగా పూయాలి.
2. తర్వాత ఏదైనా రెండు సూదుల్లాంటి పరికరాలను తీసుకొని, తెలుపు, నలుపు రంగుల పాలిష్లలో ముంచాలి. వాటితో ఇప్పుడు మధ్య వేలుపై ఫొటోలో కనిపిస్తున్న విధంగా చుక్కలు పెట్టుకోవాలి.
3. ఇప్పుడు చూపుడు వేలు, ఉంగరం వేలుకు రెండు చుక్కల చొప్పున పెట్టుకోవాలి.
4. పైన పెట్టుకున్న చుక్కల మధ్యలో ఇప్పుడు స్కై బ్లూ కలర్‌తో చుక్కలు పెట్టాలి. ఆ తర్వాత వాటి చుట్టూ తెలుపు రంగు పాలిష్‌తో చిన్నసైజు చుక్కలు పెట్టాలి.
5. తర్వాత స్కై బ్లూ కలర్ పాలిష్‌లో ముంచిన సూదితో చూపుడు, ఉంగరం వేళ్ల గోళ్లపై ఉన్న సర్కిల్స్ చుట్టూ మరో రౌండ్ పెద్ద సైజు చుక్కలు పెట్టాలి.
6. ఇప్పుడు అవే గోళ్లపై.. ఖాళీగా కనిపిస్తున్న ప్రాంతంలో స్కై బ్లూ కలర్ చుక్కలు పెట్టాలి.
7. మధ్య వేలి గోరుకు కింది భాగంలో స్కై బ్లూ, వైట్, బ్లాక్ కలర్ పాలిష్‌లతో... ఫొటోలో కనిపిస్తున్నట్టుగా చుక్కలు పెట్టాలి. ఈ డిజైన్‌నే చిటికెన వేలుకు, బొటన వేలుకు వేసుకోవాలి.
8. చివరగా గోళ్లన్నిటికీ ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో ఫినిషింగ్ కోట్ వేస్తే... ఆ గోళ్లందమే వేరు.