మహిళలకు ట్యాక్సీలు, ఆటో డ్రైవింగ్‌పై శిక్షణ
న్యూఢిల్లీ: మహిళలకు ట్యాక్సీలు, ఆటో డ్రైవింగ్‌పై ఢిల్లీ ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. దీంతోపాటు ఆత్మరక్షణ విద్యలను కూడా నే ర ్పనుంది. ఈ కార్యక్రమానికి రక్షిత అని నామకరణం చేసింది. దీనిని జిల్లా మేజిస్ట్రేట్ కునాల్ మంగళవారం ప్రారంభించారు. డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చి అనే సంస్థ ట్యాక్సీలు, ఆటోరిక్షా డ్రైవింగ్‌పై మహిళలకు శిక్షణ ఇవ్వనుంది. దీంతోపాటు డ్రైవింగ్ లెసైన్సులను కూడా మంజూరు చేయనుంది. శిక్షణ అనంతరం ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద రుణాలను కూడా మంజూరు చేయనుంది. దీంతో వారు ట్యాక్సీలు, ఆటోరిక్షాలను కొనుగోలు చేసుకునేందుకు వీలవుతుంది. నగర మహిళలు ముఖ్యంగా ఉద్యోగినులు తీవ్ర అభద్రతా భావానికి లోనవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉబర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న మహిళా ఉద్యోగినిపై అత్యాచార ఘటన తర్వాత మహిళా ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు ఉండాల్సిన అవసరం నెలకొంది. దీనిని గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వం తదనుగుణంగా చర్యలు తీసుకుంటోంది.