ఆటోమొబైల్ రంగానికి ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆటోమొబైల్ రంగ పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకొంది. విడిభాగాలు, ఇతర ముడి పరికరాల దిగుమతిపై ఉన్న 14.5 వ్యాట్‌ను తగ్గించింది. జహీరాబాద్‌లోని మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ యాజమాన్యం ఇటీవల సీఎం కేసీఆర్ ఆ కంపెనీని సందర్శించినప్పుడు 14.5 శాతం పన్ను వల్ల నష్టం వస్తోందని చెప్పారు. దీంతో రాష్ట్రంలోని పరిశ్రమలకు విక్రయించే ఆటో కాంపొనెంట్స్ మీద పన్నును 5 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో 50ని జారీ చేసింది.
మేడ్చల్‌లో 200 ఎకరాల్లో ఆటోమొబైల్ పార్క్
రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామికవిధానంలో భాగం గా మేడ్చల్‌లో 200 ఎకరాల్లో ఆటోమొబైల్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బాలానగర్‌లోని ఎంఎల్ఆర్ కంపెనీ, రాప్టర్ మోటార్స్, కింగ్టాంగ్ అనే విదేశీ కంపెనీలు ఇక్కడ ప్లాంట్లు నెలకొల్పేం దుకు ఆసక్తి చూపుతున్నాయి. వ్యాట్ తగ్గింపుతో ఆటోమొబైల్ పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు.