'క్యాబ్' పగ్గాలు చేపట్టిన దాదా
టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురువారం అధికారికంగా 'క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్' (క్యాబ్) పగ్గాలు చేపట్టారు. కోల్కతాలో జరిగిన ప్రత్యేక జనరల్ మీటింగ్ సమావేశంలో గంగూలీ క్యాబ్ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నారు. సెప్టెంబర్ 20న జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మరణంతో గంగూలీ ఈ స్థానాన్ని భర్తీ చేశారు. దాల్మియా తనయుడు అవిషేక్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. కేవలం 10 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో గంగూలీ, అవిషేక్లను బెంగాల్ క్రికెట్ బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.