మధుమేహంపై బాలిక వినూత్న పోరాటం
న్యూఢిల్లీ: తన కుటుంబంలో ముగ్గురిని బలితీసుకున్న షుగర్వ్యాధిపై అమెరికాకు చెందిన 16 ఏళ్ల భారత సంతతి అమ్మాయి అవని మదానీ వినూత్న పోరాటం ప్రారంభించింది. తన కుటుంబ సభ్యుల్లా ఇతరులు ఈ వ్యాధి బారిన పడకుండా అవగాహన కలిగించేందుకు ‘దీ హెల్త్ బీట్’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది. హిందీ, ఇంగ్లీష్ భాషలలో రూపొందించిన ఈ వెబ్సైట్లో మధుమేహం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పొందుపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత సమాజానికి ఆహార అలవాట్ల గురించి అవగాహన కల్పించడమే ఈ వెబ్సైట్ ఉద్దేశం.
ఈ వెబ్‌సైట్‌కు భారత్‌కు చెందిన ది డయాబెటిక్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 41 సంస్థలు సహాయ సహకారాలను అందిస్తున్నాయి. భారతీయులు తీసుకునే ఆహారంలో పిండిపదార్థాలు, కొవ్వు అధిక పరిమాణంలో ఉండటం వల్లే ఎక్కువ మంది మధుమేహ బారినపడుతున్నారని మదానీ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహానికి గురవుతున్న వారిలో భారత్‌లోనే 20 శాతం ఉన్నారని పేర్కొంది. ఇండియాలో 2015లో 6.9 కోట్ల డయాబెటిస్ కేసులు నమోదుకాగా, 10 లక్షల మంది మరణించారు.