షార్ట్‌సర్క్యూట్‌తో ఎస్బీహెచ్ బ్యాంక్ దగ్ధం
నర్సంపేట, న్యూస్‌లైన్ : షార్ట సర్క్యూట్‌తో ఎస్బీహెచ్ బ్యాంక్ దగ్ధమైన సంఘటన పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మేనేజర్ అవుర్కువూర్ కథనం ప్రకారం.. బ్యాంక్ పునఃనిర్మాణంలో భా గంగా ఇటీవల కార్యాలయంలో రెండు నూతన గదుల నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఇందులో ఒక గది ఇటీవల పూర్తి కావడంతో పాత గదుల్లో ఉన్న రికార్డులను తీసి సిబ్బంది అందులో భద్రపర్చారు. ఈ క్రమంలో రెండో గదిలో వెల్డింగ్ పనులు జరుగుతుండగా ప్రవూదవశాత్తు తెల్లవారుజామున 3 గంటలకు విద్యుత్ వైర్లు షార్ట్‌సర్క్యూట్‌కు గురయ్యాయి.
గమనించిన చుట్టుపక్కల వారు ఫైర్‌స్టేషన్‌కు సవూచారం అందించారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వుంటలు ఆర్పే ప్రయుత్నం చేసినప్పటికీ గదిలో ఉన్న రికార్డులు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. కాగా, ఈ సంఘటనలో భవనం ధ్వంసమై సువూరు 30 లక్షల నష్టం జరిగినట్లు మేనేజర్ పేర్కొన్నారు. ఖాతాదారులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని, బ్యాంక్‌లో పనులు కార్యకలాపాలు యుథావిధిగా కొనసాగుతాయుని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సంఘటనా స్థలాన్ని ఎస్బీహెచ్ డీజీఎం వూర్చ్ ఫుటీ, ఏజీఎం పటేల్, డీఎస్పీ కడియుం చక్రవర్తి, టౌన్ సీఐ వాసుదేవరావు సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.