సాయిబాబా ఆలయంలో హుండీ చోరీ
అశ్వాపురం: ఖమ్మం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.