'నోట్లరద్దుపై అవగాహన కల్పిస్తాం'
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుపై రాష్ర్టంలోని అన్ని పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. దేశ సంక్షేమం కోసం తీసుకున్న రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. ఈ నిర్ణయం నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కేడర్‌కు పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని కొన్ని విపక్షాలు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో న్యాయ, బ్యాంకింగ్, పోలీస్, ఆర్థికనిపుణులను భాగస్వాములను చేసి ప్రజల అపోహలను దూరం చేసేందుకు చర్చా గోష్టులను నిర్వహిస్తున్నామన్నారు.