ayodhya nagar
-
వృద్ధురాలి అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్ : అయెధ్యనగర్‌లో వృద్ధురాలి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. శారద అపార్టుమెంటులోని తన ఫ్లాట్‌లో రాధా పూర్ణిమ(62) అనే మహిళ శవంగా మారడం అనుమానాలకు తావిస్తోంది. వివరాలు.. రాధాపూర్ణిమ డీఆర్డీఎల్ పాఠశాలలో టీచర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ప్రస్తుతం ఆమె అయోధ్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తన ఫ్లాట్‌లో రాధాపూర్ణిమ మృతి చెందారు. ఈ విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శవానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
పేకాట ఆడుతున్న ఏడుగురు కానిస్టేబుళ్ల అరెస్ట్
మహబూబ్‌నగర్: పోలీసులు దారి తప్పారు. నిత్యం పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి పేకాట ఆడేవారిని అరెస్ట్ చేసే పోలీసులే పేకాట రాయుళ్లుగా అవతారమెత్తారు. ఈ దృశ్యం మహబూబ్‌నగర్ జిల్లా అయోధ్య నగర్లో ఆదివారం వెలుగుచూసింది. అందిన సమాచారం మేరకు పేకాట ఆడుతున్న స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుళ్ల నుంచి 93 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఆంధ్రా బ్యాంకు 2000వ బ్రాంచ్
విజయవాడ (మధురానగర్), న్యూస్‌లైన్ : ఆంధ్రా బ్యాంకు 2000వ శాఖను విజయవాడలోని అయోధ్యనగర్ లోటస్‌ల్యాండ్ మార్క్‌లో సోమవారం ఆ బ్యాంకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సీవీఆర్ రాజేంద్రన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రాబ్యాంకు మొట్టమొదట జిల్లాలోని మచిలీపట్నంలోనే ప్రారంభమయ్యిందని, రెండు వేలవ బ్రాంచిని కూడా జిల్లాలోనే ఏర్పాటుచేయడం విశేష మన్నారు. దేశవ్యాప్తంగా రెండు వేల బ్రాంచీలలో 1213 బ్రాంచీలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఇందులో సీమాంధ్రప్రాంతంలో 754 శాఖలు, తెలంగాణా ప్రాంతంలో 459 బ్రాంచీలున్నాయన్నారు. సీమాంద్ర, తెలంగాణా ప్రాంతాలు విడిపోయినా బ్యాంకు సేవలలలో మాత్రం ఎటువంటిలోపాలు రానీయమన్నారు. -
అదృశ్యమైన శివ నాగనందిని ఆచూకీ లభ్యం
విజయవాడ : విజయవాడలో కలకలం సృష్టించిన బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అదృశ్యమైనట్లుగా భావిస్తున్న పాప ఆచూకీ దొరికింది. అయోధ్య నగర్‌కు చెందిన ఫైనాన్స్ వ్యాపారి దుర్గా నరేష్ కూతురు శివనాగ నందిని నిన్న అదృశ్యం అయ్యిందంటూ పాప తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఉదయం స్కూలుకు వెళ్లిన తమ కూతురు స్కూలు నుంచి తిరిగి వచ్చేటప్పుడు కనిపించకుండా పోయిందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు శివనాగ నందిని ఆచూకీ కనిపెట్టారు. పోలీసుల సంరక్షణలో ఆమె క్షేమంగా ఉంది. పాప క్షేమంగా ఉందనే సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.