22 ఏళ్ల తర్వాత క్రేజ్ తగ్గని రజనీ 'భాషా'
ముంబై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీలలో ఒకటైన 'భాషా' రీ రిలీజ్‌ను ఆయన ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇది మన దేశంలో కాదండోయ్.. జపాన్, ఫ్రాన్స్ దేశాలోని కొన్ని నగరాలలో భాషా రీ రిలీజ్ అయిన థియేటర్ల వద్ద సందడి వాతావారణం కనిపిస్తోంది. రజనీకాంత్ కటౌట్ కు పాలాభిషేకాలు చేసిన అభిమానులు అనంతరం టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేశారు. జపాన్ లో మాత్రమే ఓ రేంజ్లో ఆధరిస్తారని తెలుసు. కానీ, ఫ్రాన్స్ లాంటి దేశంలోనూ సూపర్ స్టార్ అభిమానులకు కొదవలేదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సూపర్ స్టార్ ఫ్యాన్స్ జపాన్, ఫ్రాన్స్‌లో రజనీ అభిమానుల సందడిని ఓ పోస్ట్‌లో ట్వీట్ చేశారు.
1995 జనవరి 15న గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో విడుదలైన భాషా సినిమా సూపర్ స్టార్ ఇమేజ్ను అత్యున్నత శిఖరాలకు చేర్చింది. ఆ మూవీకి కాస్త సాంకేతిక మెరుగులు దిద్ది గతేడాది చివర్లో రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో కొన్ని దేశాలలో భాషాను రీ రిలీజ్ చేయగా విపరీతమైన స్పందన వచ్చింది. శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్‌గా '2.0'తో రానున్న రజనీకాంత్‌కు 22ఏళ్ల తర్వాత కూడా భాషా మూవీకి క్రేజ్ తగ్గకపోవడం తలైవాకు కలిసొచ్చే అంశం.
This is Not n India
Its France #Baasha Celebration#Thalaivar Power@sri50 @rameshlaus @FTPindia @dhanyarajendran #RBSIBaasha @hrishikeshkk pic.twitter.com/TsmVyuSC0p
— Rajinikanth Fans (@Rajni_FC) 4 March 2017
Japan #Thalaivar Fans Celebrating #Baasha Digital Release
Mass over the World #BaashaRules#RBSIBaasha @hrishikeshkk @rameshlaus @sri50 pic.twitter.com/86BVe8vCLa
— Rajinikanth Fans (@Rajni_FC) 5 March 2017