మోస్ట్‌వాంటెడ్ నిందితుడు బాబు భాగ్యరాజ్ అరెస్ట్
నెల్లూరు: చిక్కడు, దొరకడు అన్న తరహాలో రెండు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిస్తున్న మోస్ట్‌వాంటెడ్ నిందితుడు బాబు భాగ్యరాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మంగళవారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి భారీ మొత్తంలో బంగారం, నగదును నాయుడపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు భాగ్యరాజ్‌పై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పలు కేసులు నమోదైయ్యాయి. చోరీలకు పాల్పడతూ రెండు రాష్ట్రాల పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న భాగ్యరాజ్ కోసం చెన్నై సమీపంలోని మాదవరంలో చెన్నై, ఏపీ పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.