ముళ్లకంపలో ఆడ శివువు మృతదేహం
హిందూపురం అర్బన్ : హిందూపురం ఆర్టీసీ డిపో సమీపంలోని ముళ్లకంపల్లో ఓ ఆడ శిశువు మృతదేహౠన్ని పోలీసులు శనివారం కనుగొన్నారు. వారి కథనం మేరకు... స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఈ నెల ఒకటిన జన్మించినట్లు శిశువు చేతికి ఆస్పత్రి వైద్యులు వేసిన ట్యాగ్ అలాగే ఉంది. ఆడపిల్లను భారమనుకున్నారో, ఏమో గానీ ఆస్పత్రి నుంచి డిచార్జి కాగానే అదే బ్యాగులో ఉంచి శిశువు మృతదేహాన్ని పడేశారో తెలియరాలేదు. ఉదయం ఆటుగా వెళ్లిన ఆటో డ్రైవర్ కంట బ్యాగును కుక్కలు లాగుతుండడం గమనించారు. వెంటనే ముస్లిం నగర ప్రతినిధఙ ఉమర్ఫరూక్కు తెలిపారు.
ఆయన వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ తరువాత అక్కడికి వెళ్లి బ్యాగును చూస్తే ఆడ శిశువు మృతదేహాన్ని గుర్తించారు. చిన్నారి చేతికి కట్టి ఉన్న ఆస్పత్రి ట్యాగ్ ద్వారా ఆస్పత్రిలో విచారణ చేసి తల్లిదండ్రుల అడ్రసు కనుగొన్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. సాయంత్రానికి సోమందేపల్లి మండలం నల్లగొండపల్లికి చెందిన జయమ్మ, జయరాం గా గుర్తించి పిలిపించారు. జయరాం మొదటి భార్య చనిపోగా, అప్పటికే ఆమెకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. దీంతో జయరాం రెండోపెళ్లి చేసుకున్నాడు. ఆమెకు మూడుసార్లు ఆబ్రార్షన్లు అయ్యాయి. నాల్గవసారి పుట్టిన ఆడపిల్ల శుక్రవారం రాత్రి చనిపోవడంతో, తన బావమ్మర్ది ఈశ్వర్‌కు శిశువును అప్పగించడంతో అతను పూడ్చకుండా పడేశాడని వారు తెలిపారు. ప్రజాసంఘాల నాయకులు ఉదయ్‌కుమార్, ఉమర్‌ఫరూక్ మరికొందరు కలసి సంప్రదాయంగా ఖననం చేశారు.