baby photo
-
విరుష్క తనయ ఫోటోల విషయంలో నెటిజన్ల ఆగ్రహం
పూణే: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని సతీమణి అనుష్క శర్మ.. తమ బిడ్డ విషయంలో మీడియాను ఎంత ప్రాధేయపడ్డా, అర్ధం చేసుకోవడం లేదని విరుష్క అభిమానులు మండిపడుతున్నారు. పూణే ఎయిర్‌పోర్టులో విరుష్క జోడీ.. తమ గారాలపట్టితో వెళ్తున్న సమయంలో కొందరు ఫోటోగ్రాఫర్లు అత్యుత్సాహం ప్రదర్శించి వామిక(కోహ్లి, అనష్కల కుమార్తె) ఫోటోలను తీసేందుకు ప్రయత్నించడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు మాసాలు కూడా దాటని పసిబిడ్డ విషయంలో తల్లిదండ్రులకు ఎన్నో భయాలు ఉంటాయని, కనీసం వాటిని గౌరవించైనా మీడియా, వామిక ఫోటోల కోసం ఎగబడడం మానుకోవాలని హితవు పలికారు. ఇక్కడ చదవండి: ఏందిది కోహ్లీ.. ఇంకెన్నాళ్లు దాచి పెడతావ్! కోహ్లి దంపతులు.. తమ బిడ్డ ప్రైవసీకి భంగం కల్గించవద్దని అభిమానులను, మీడియాను ప్రాధేయపడ్డ సంగతి తెలిసిందే. తమ బిడ్డకు సంబంధించిన ఫోటోలను కానీ, కంటెంట్‌ను కానీ మీడియాలో ఎక్కడా ప్రస్థావించవద్దని వారు మీడియాకు విజ్ఞప్తి చేసినప్పటికీ.. కొందరు ఫోటోగ్రాఫర్లు తమ వార్తల కోసం పసిబిడ్డ ఫోటోలను వాడుకోవడంపై సోషల్ మీడియా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లి కుటుంబానికి సంబంధించిన ఫోటోలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 11న కోహ్లి సతీమణి అనుష్క ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా, ఇంగ్లండ్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు కోహ్లి పూణేకు చేరుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటన ప్రారంభమైన నాటి నుంచి కోహ్లి తన కుటుంబంతో కలిసే ఉంటున్నాడు. -
జూనియర్ 'చిరు'ను పరిచయం చేసిన మేఘనా
సాక్షి, బెంగళూరు : కన్నడ నటి మేఘనా రాజ్ మొదటిసారిగా తన కొడుకును అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ చిరు(సింబా)అంటూ చిన్నారి పేరును ప్రకటించారు. తమ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలతో ఒక నిమిషం పాటు నిడివి ఉన్న వీడిమోను మేఘనా షేర్ చేశారు. అక్టోబర్ 22, 2017న దివంగత నటుడు చిరంజీవి-మేఘనాల ఎంగేజ్మెంట్తో వీడియో ప్రారంభం అవుతుంది. సరిగ్గా మూడేళ్ల తర్వాత అదే రోజున 2020లో మేఘనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 'నేను పుట్టకముందు నుంచే మీరు నన్ను ఎంతో అభిమానించారు. మొదటిసారి మిమ్మల్ని కలుసుకుంటున్న తరుణంలో మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు కృతఙ్ఞతలు..నేను మీ జూనియర్ సీ' అంటూ మేఘన తన కొడుకును ఇంట్రడ్యూస్ చేశారు. ఎంతో ఎమెషనల్‌గా సాగే ఈ వీడియోను నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇప్పటికే ఈ వీడియోకు 10 లక్షలకు పైగానే వ్యూస్ వచ్చాయి. కాగా చిరంజీవి-మేఘనాలు 2018లో మేలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది జూన్ 7న చిరు సర్జా గుండెపోటుతో మరణించాడు. అప్పటికే 5 నెలల గర్భవతిగా ఉన్న మెఘనా రాజ్ గతేడాది అక్టోబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చారు. 36 ఏళ్ల వయసులో చిరంజివి సర్జా గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూయడం అటు కుటుంబ సభ్యులను, ఇటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చదవండి : (భర్త కటౌట్‌తో నటి సీమంతం) (నిన్ను ప్రేమిస్తూనే ఉంటా: మేఘనా రాజ్) View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) -
స్మరిత ఫొటోగ్రఫీ.. సెలబ్రిటీల ఫిదా
శ్రీనగర్‌కాలనీ: యూకేలో ఎంఎస్, యూఎస్ఏలో కుటుంబంతో సెటిల్ అయ్యింది. కానీ ఫొటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం. ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే ఆమెకు ప్రాణం. ఆ ఇష్టంతోనే న్యూ బార్న్ ఫోటోగ్రఫీలో మెళకువలు నేర్చుకుంది. అమెరికాలో ఆమె పోటోలకు ఫిదా అయిన అనేక మంది హైదరాబాద్ రావాలని పట్టుబట్టడంతో సిటీకి వచ్చి న్యూబార్న్ పొటోగ్రఫీలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుతుంది నగరానికి చెందిన స్మరిత విన్నకోట. ఇక్కడే ఇంజనీరింగ్ చదివిన స్మరిత సెలబ్రిటీస్ పిల్లలకు పొటోగ్రఫీ చేసి వారి మన్ననలు పొందుతూ న్యూ బార్న్ ఫొటోగ్రఫీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తన గురించి, ఫొటోగ్రఫీ విషయాలను సాక్షికి వివరించింది. పిల్లలంటే ఇష్టం.. నగరానికి చెందిన అమ్మాయినే..జేబీఐటీలో ఇంజనీరింగ్ చేశాను. తర్వాత యూకేలో ఎంఎస్ చేశాను. చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే అప్పుడప్పుడు పొటోలను తీసేదాన్ని. పెళ్ళయ్యాక భర్త నవీన్‌తో కలిసి యూఎస్ఏలో సెటిలయ్యాం. కానీ ఎక్కడో వెళితిగా ఉండేది. ఫొటోగ్రఫీ చేయాలని గట్టిగా అనుకున్నాను. అందులోనూ న్యూ బార్న్ చిన్నారులకు ఫొటోగ్రఫీ చేయాలనుకున్నాను. ఆన్లైన్లో కోర్సులను, బేబీ సేఫ్టీ వర్క్ షాప్ నేర్చుకున్నాను. యూఎస్‌లో ఇంటర్నేషనల్ న్యూ బార్న్ ఫొటోగ్రఫీలో మెంబర్ని. బ్యూటీ అండ్ లైఫ్‌స్టైల్ మామీ మ్యాగ్జీన్– పేరెంట్స్ ఛాయిస్ అవార్డు లభించింది. అలా న్యూ బార్న్ ఫొటోగ్రఫీ నాకు మరో భాగస్వామిగా మారింది. జస్ట్ బార్న్ ఫొటోగ్రఫీకి మంచి రెస్పాన్స్ 2014 నుండి న్యూ బార్న్ ఫొటోగ్రఫీ చేస్తున్నాను. పుట్టిన 14 రోజుల్లో జస్ట్‌బార్న్ ఫొటోగ్రఫీ చేయాలి. యూఎస్‌లో ఈ ఫొటోగ్రఫీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడి ఇండియన్స్‌తో పాటు విదేశీయులు సైతం జస్ట్‌బార్న్ ఫొటోగ్రఫీని ఇష్టపడేవారు. అలా అక్కడ ఫొటోగ్రఫీకి చాలా అద్బుతమైన స్పందన వచ్చింది. మన తెలుగువారు చాలా మంది హైదరాబాద్ నుండి మెయిల్స్, సోషల్‌మీడియాలో మెసేజెస్, ఫోన్లు చేసి ఇక్కడి రావాలని పట్టుబట్టారు. కొంత మంది సెలబ్రిటీస్ ఫొటోగ్రఫీకి కితాబివ్వడం ఆనందాన్నిచ్చేది. సుమారుగా 500 న్యూబార్స్ బేబీస్‌కి ఫొటోగ్రఫీ చేశాను. అలా సొంత నగరానికి రావాల్సి వచ్చింది. ప్రముఖుల పిల్లలకు ఫొటోలు బేబీ బార్న్ ఫొటోగ్రఫీని నగరంలోని చాలా మందికి చేశాను. అందులో మంచు విష్ణు కుమార్తె, మెగాస్టార్ మనవరాలు, శ్రీజ–కళ్యాణ్‌దేవ్ కుమార్తెకు, దిల్‌రాజు మనవరాలికి, అశ్వనీదత్ మనవరాలికి బేబీ బార్న్ ఫొటోగ్రఫీ చేశాను. -
మా బుజ్జాయి భలేగా ఉంది..
గత ఆగస్ట్‌లో మాతృత్వపు ఆనందం పొందిన ప్రముఖ సింగర్ క్రిస్టీనా అగిలేరా పుత్రికోత్సాహంతో పొంగిపోతోంది. ఐదు నెలలు నిండిన తన బుజ్జాయి ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఈ ప్రపంచాన్ని జయించడానికి మా చిట్టితల్లి వస్తోంది’ అంటూ దానికి క్యాప్షన్ కూడా జత చేసింది. ఫొటోలో పింక్ కలర్ డ్రెస్‌లో అంబాడుతున్న జూనియర్ క్రిస్టీనా ముఖం కనిపించకున్నా.. ముద్దుగానే కనిపిస్తోంది.