పెళ్లాం వద్దు!
వయసు ఐదు పదులు దాటుతున్నా బ్యాచ్లర్షిప్కు బ్రేక్ వేసే ఉద్దేశం లేనట్టుంది బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు. ముద్దుగుమ్మలతో రొమాన్స్కైతే సై అంటున్నాడు కానీ... పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు ఇతగాడు. పైగా... తనకు పిల్లలైతే కావాలి గానీ... పెళ్లాం వద్దంటూ విచిత్రంగా సెలవిచ్చాడు రీసెంట్గా. అంతటితో ఆగాడా..!
ఆ పిల్లలకు తల్లి కూడా కావాలట. కానీ... ఆమె తన భార్య మాత్రం కాకూడదట. ఇంతకీ మనోడి మైండ్ సెట్ ఏమిటి? పెళ్లీ పెటాకులు లేకుండా ఓ అమ్మాయి తనతో కాపురం చేసి... పిల్లల్ని కనిపెట్టి... వారిని సాకాలనా! ‘నాకు తెలుసు ఇది చాలా క్లిష్టమైందని. అందుకే ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదు’ అని మరోసారి కన్ఫ్యూజ్ చేశాడు కండల బాబు!