మొదలైన ఫుడ్క్రాఫ్ట్ శిక్షణ తరగతులు
ఆరిలోవ: రూరల్ రెవెన్యూ కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ ఫుడ్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ రవి బుధవారం తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. ప్రస్తుతం ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్న ఫుడ్ ప్రొడెక్షన్ కోర్సులో 80 మంది, బేకరీ అండ్ కన్ఫిక్షనరీ కోర్సులో 20 మంది చేరారన్నారు. వీరిలో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు చిత్తూరు, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని చెప్పారు. వీరికి ఏడాదిపాటు కేక్, బన్, సాండ్విచ్, బిస్కెట్లు, వంటి తదితర వంటకాల తయారీలో తర్ఫీదునిస్తామని, అనంతరం ఇండస్ట్రీయల్ శిక్షణనిస్తామన్నారు. దీనిలో భాగంగా నగరంలోని పలు స్టార్ హోటళ్లకు తీసుకువెళ్లి సర్వీస్, ఫుడ్ తయారీ తదితర వాటిలో మెలకువలు నేర్పిస్తామన్నారు.